POURNAMI GARUDA SEVA HELD _ వైభవంగా కార్తీకపౌర్ణమి గరుడసేవ

TIRUMALA, 27 NOVEMBER 2023: The auspicious Karthika Pournami Garuda Vahana Seva was observed with celestial fervour in Tirumala on Monday evening.

Sri Malayappa in all His resplendence took out a majestic ride atop the mighty Garuda Vahanam and paraded along the four mada streets to bless His devotees.

Temple DyEO Sri Lokanatham, other temple staff, officials, devotees were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

వైభవంగా కార్తీకపౌర్ణమి గరుడసేవ

తిరుమల, 2023 న‌వంబ‌రు 27: తిరుమలలో సోమ‌వారం రాత్రి కార్తీకపౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను క‌టాక్షించారు.

గ‌రుడ వాహ‌నం – స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, విజివో శ్రీ నందకిషోర్, పేష్కార్ శ్రీ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.