HUGE CROWD OF DEVOTEES FOR THUMBURU THEERTHA MUKKOTI _ తుంబురు తీర్థ ముక్కోటికి విశేషంగా విచ్చేసిన‌ భక్తులు

Tirumala, 18 Mar. 22: Huge crowd of devotees thronged the Thumburu Thirtha Mukkoti celebrations organised after a gap of two years of Covid by TTD, deep inside the Sheshachala forests on Friday.

The annual fete is held on the Pournami day of Phalguna month on the Uttara Phalguni star. Devotees were allowed inside the forest terrain on Thursday (from morning to evening in daylight) and on Friday for four hours from 06.00 am are to 10. 00 am only.

In spite of tough terrain, as many as 13,200 devotees visited the sacred theertha, one of the hundreds in the Sheshachala forest.

TTD EXTENSIVE ARRANGEMENTS

To facilitate the devotees and the sacred celebrations they made extensive arrangements, Anna Prasadam distribution was made at Papavinasam dam besides primary health centre, two ambulances, while one medical team was placed at Thumburu Thirtha and medicine and tablets were given to a few devotees.

Water taps were set up along the way to theertha besides ladders, barricades, metal chains and ropes for the safe journey of devotees

A team of 80 sanitary workers of the TTD health wing, along with police, vigilance and Srivari Sevakulu provided support to devotees from Papavinasam to Thumburu theertha.

 ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తుంబురు తీర్థ ముక్కోటికి విశేషంగా విచ్చేసిన‌ భక్తులు

తిరుమల, 2022, మార్చి 18: తిరుమలలోని శేషాచల అడవుల్లో ప్రముఖ తీర్థంగా భాసిల్లుతున్న తుంబురు తీర్థముక్కోటికి విశేషంగా భక్తులు తరలివచ్చారు. కోవిడ్ నేపథ్యంలో రెండేళ్ల తరువాత అనుమతించడంతో భక్తులు ఉత్సాహంగా విచ్చేశారు. ప్ర‌తి ఏడాదీ ఫాల్గుణ మాసంలో ఉత్తర ఫల్గుణి నక్షత్రంతో కూడిన పౌర్ణమినాడు ఈ తీర్థ ముక్కోటి జ‌రుగుతుంది. గురువారం ఉదయం 6 నుండి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు, తిరిగి శుక్ర‌వారం ఉద‌యం 6 నుండి ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కు భ‌క్తుల‌ను అనుమ‌తించారు. మొత్తం 12300 మందికిపైగా భక్తులు తుంబురు తీర్థాన్ని సందర్శించారు.

టిటిడి విస్తృత ఏర్పాట్లు  

తుంబురు తీర్థానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం టిటిడి విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. పాప‌వినాశనం డ్యామ్ వ‌ద్ద శ్రీ‌వారి సేవ‌కుల ద్వారా భ‌క్తుల‌కు అన్న‌ప్ర‌సాదాలు పంపిణీ చేశారు. పాప‌వినాశ‌నం డ్యామ్ వ‌ద్ద ప్ర‌థ‌మ చికిత్స కేంద్రం, రెండు అంబులెన్స్‌లు, తుంబురు తీర్థం వ‌ద్ద ఒక వైద్య‌బృందాన్ని అందుబాటులో ఉంచారు. ప‌లువురు భ‌క్తుల‌కు ఉచితంగా మందులు, మాత్ర‌లు అందించారు. భక్తులు అన్న‌ప్ర‌సాదాలు స్వీక‌రించేందుకు వీలుగా పాపానాశనం నుండి దారి పొడవునా పలు చోట్ల తాగునీటి కొళాయిలు ఏర్పాటుచేశారు. మార్గమధ్యంలో భ‌క్తుల‌కు ఇబ్బందులు లేకుండా నిచ్చెనలు, బ్యారీకేడ్లు, ఇనుప కంచెలు, రోప్‌లు ఏర్పాటు చేశారు.

ఆరోగ్య విభాగం ఆధ్వ‌ర్యంలో 80 మందికి పైగా పారిశుద్ధ్య సిబ్బంది సేవ‌లందించారు. పోలీసుశాఖ, అటవీశాఖ, టిటిడి విజిలెన్స్ విభాగం సమన్వయంతో పాపవినాశనం నుండి తుంబురు తీర్థం వరకు అక్కడక్కడ సిబ్బందిని వుంచి భద్రతా ఏర్పాట్లు చేశారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.