SRI SHUBAKRUT NAMA PANCHAGAM RELEASED _ శ్రీ శుభకృత్‌ నామ సంవ‌త్స‌ర పంచాంగం ఆవిష్క‌ర‌ణ

Tirupati, 18 Mar. 22: TTD EO Dr KS Jawahar Reddy on Friday released the TTD annual Panchangam of Sri Shubakrut Nama samvatsaram at the Sri Padmavati rest house in Tirupati.

It is well known that as part of its mandate for the propagation of the Santana Hindu dharma the TTD published the almanac on the occasion of Telugu New Year, Ugadi.

The new Panchangam has been colourfully printed with an eye-catching design drafted by TTD Asthana siddhanti Sri Tangirala Venkata Purna Prasad and narrated by Vaikhanasa pundit Acharya Vedantaam Vishnu Bhattacharya. Besides regular features of Rashi, matrimonial, wedding Muhurtams, the Panchangam is also comprised of special utsavas at Tirumala.

Priced at ₹75/- the Panchangam will be available for sale to devotees from Saturday onwards at Tirupati and at all TTD information centres from March last week.

TTD Additional EO Sri AV Dharma Reddy JEO Sri Veerabrahmam, SVBC CEO Sri Suresh Kumar. TTD Asthana Siddhanti Sri Tangirala Venkata Purna Prasad and Special officer of Press and sales wing Sri Rama Raju were present.

 ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ శుభకృత్‌ నామ సంవ‌త్స‌ర పంచాంగం ఆవిష్క‌ర‌ణ

తిరుప‌తి, 2022 మార్చి 18: తిరుప‌తిలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం శ్రీ శుభకృత్‌ నామ సంవ‌త్స‌ర పంచాంగాన్ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి ఆవిష్క‌రించారు.

ధర్మప్రచారంలో భాగంగా టిటిడి ప్రతి ఏడాదీ తెలుగు సంవత్సరాది అయిన ఉగాది నాటికి పంచాంగాలను ముద్రించి భక్తలోకానికి అందిస్తున్న విషయం తెలిసిందే. భ‌క్తుల‌ను నిరంత‌రం ర‌క్షించే గోవిందుడు స‌ర్వ‌మాన‌వాళిని చ‌ల్ల‌గా చూచే తండ్రి. శ్రీ‌వారి ఆస్థాన‌మైన టిటిడి ప్ర‌తి సంవ‌త్స‌రం పంచాంగాన్ని భ‌క్త లోకానికి అందించ‌డం అన‌వాయితీగా వ‌స్తున్న‌దే. అదేప్ర‌కారం ఈ ఏడాది కూడా నూత‌న సంచాంగాన్ని భ‌క్తుల‌కు అందిస్తోంది.

ఇందులో భాగంగా రాబోయే శ్రీ శుభకృత్‌ నామ సంవత్సర పంచాంగాన్ని ఆకర్షణీయంగా ముద్రించింది. టిటిడి ఆస్థాన సిద్ధాంతి శ్రీ తంగిరాల వెంకటపూర్ణప్రసాద్‌ సిద్ధాంతి రాసిన ఈ పంచాంగాన్ని వైఖాన‌స పండితులు ఆచార్య వేదాంతం విష్ణుభ‌ట్టాచార్యులు సులభంగా, అందరికీ అర్థమయ్యేలా పరిష్కరించారు. రాజాధి నవనాయకుల ఫలితాలతోపాటు రాశిఫలాలు, వధూవర గుణమేళనము, వివాహాది సుముహూర్త నిర్ణయాలు, టిటిడిలో నిర్వహించే విశేష ఉత్సవాలు తదితర విషయాలను చక్కగా వివరించారు.

రూ.75/- విలువ గల ఈ పంచాంగం తిరుమల, తిరుపతిలో శనివారం నుంచి భక్తులకు అందుబాటులో ఉంటుంది. మిగతా టిటిడి సమాచార కేంద్రాలలో మార్చి చివ‌రి వారం నుండి పంచాంగం అందుబాటులో ఉంటుంది.

ఈ కార్యక్రమంలో టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం, ఎస్వీబీసీ సిఈవో శ్రీ సురేష్ కుమార్ ,టిటిడి ఆస్థాన సిద్ధాంతి శ్రీ తంగిరాల వెంకటపూర్ణప్రసాద్‌, ప్రెస్, సేల్స్ వింగ్ ప్రత్యేకాధికారి శ్రీ రామరాజు త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.