HUGE RESPONSE FOR APT ONLINE SERVICES / ఎపిటి ఆన్‌లైన్‌ సెంటర్లలో రూ.300/- దర్శన టికెట్ల బుకింగ్‌కు విశేష ఆదరణ

Tirupati, 7 February 2017: The Rs.300 ticket booking facility has been garnering huge response in the twin Telugu states of AP and TS with APT online services becoming operational from February 3.

A review meeting with IT officials took place in the chambers of TTD EO Dr D Sambasiva Rao in administrative building in Tirupati on Tuesday evening.

Speaking on this occasion, the TTD EO said, with an aim to facilitate more transparent and hassle free online booking of Rs.300 tickets for the pilgrims in both AP and TS, TTD has commenced booking facility in online service centres of Andhra Pradesh and Telengana State (APT). About 1838 centres in 13 districts of AP and 2630 centres in 10 districts of TS (statistics before formation of new districts) are currently providing these services to pilgrims facilitating them to book each ticket at a service charge of just Rs.5 per ticket”, he maintained.

Later he also reviewed on Cottage Donation Scheme and the improvements to be brought to enhance this scheme.

Additional FACAO Sri Balaji, CAO Sri Raviprasad, Donor Cell DyEO Sri Rajendrudu, IT wing chief Sri Sesha Reddy, TCS experts Sri Satya, Sri Bhimsekhar and others were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఎపిటి ఆన్‌లైన్‌ సెంటర్లలో రూ.300/- దర్శన టికెట్ల బుకింగ్‌కు విశేష ఆదరణ : టిటిడి ఈవో డా|| డి.సాంబశివరావు

తెలుగు రాష్ట్రాలోని ఎపిటి ఆన్‌లైన్‌ సెంటర్లలో రూ.300/- ప్రత్యేక ప్రవేశదర్శన టికెట్ల బుకింగ్‌కు భక్తుల నుండి విశేష ఆదరణ లభిస్తోందని టిటిడి ఈవో డా|| డి.సాంబశివరావు తెలిపారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో మంగళవారం ఐటి అధికారులతో ఈవో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఫిబ్రవరి 3న రథసప్తమి నాడు ఎపిటి ఆన్‌లైన్‌ సెంటర్లలో రూ.300/- ప్రత్యేక ప్రవేశదర్శన టికెట్ల బుకింగ్‌ను ప్రారంభించామని, భక్తుల నుండి స్పందన బాగుందని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో :

ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో 1838 సెంటర్లు ఉన్నాయి. అనంతపూర్‌- 262, చిత్తూరు – 256, డా|| వైఎస్‌ఆర్‌ కడప – 182, తూర్పుగోదావరి – 152, గుంటూరు – 122, కృష్ణా – 138, కర్నూలు – 59, ప్రకాశం – 87, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు – 165, శ్రీకాకుళం – 63, విశాఖపట్నం – 147, విజయనగరం – 31, పశ్చిమగోదావరి -174.

తెలంగాణలో :

తెలంగాణలో జిల్లాల పునర్విభజన జరగకముందు ఉన్న 10 జిల్లాల్లో 2630 సెంటర్లు ఉన్నాయి. అదిలాబాద్‌ – 58, హైదరాబాద్‌ – 440, కరీంనగర్‌ – 155, ఖమ్మం – 105, మహబూబ్‌నగర్‌ – 439, మెదక్‌ – 283, నల్గొండ – 294, నిజామాబాద్‌ – 63, రంగారెడ్డి – 608, వరంగల్‌ – 185.

అనంతరం కాటేజి డోనార్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌పై ఐటి అధికారులతో ఈవో చర్చించారు. భక్తుల ఫిర్యాదులకు సంబంధించి నూతన కంప్యూటర్‌ అప్లికేషన్‌ రూపొందించాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో టిటిడి ఎఫ్‌ఏ, సిఏవో శ్రీ బాలాజి, ఐటి విభాగాధిపతి శ్రీ శేషారెడ్డి, డోనార్‌ సెల్‌ డెప్యూటీ ఈవో శ్రీ బాలాజి, ఇడిపి ఓఎస్‌డి శ్రీ బాలాజి ప్రసాద్‌, టిసిఎస్‌ అధికారులు శ్రీ సుధాకర్‌, శ్రీ సత్య ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.