KAPILESWARA SWAMY BTUs POSTERS RELEASED / శ్రీకపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల గోడపత్రికల ఆవిష్కరణ

Tirupati, 7 February 2017: The annual brahmotsavams in the famous temple of Sri Kapileswara Swamy in Kapilateertham will be observed from February 17 to February 26 with ankurarpanam on February 16 and Koil Alwar Tirumanjanam on February 15.

The ten-day religious festival takes place as per the tenets of Saivagama taking off with the ceremonial Dhwajarohanam in Meena Lagnam at 8:28am on first day on February 17.

The TTD EO Dr D Sambasiva Rao released the Posters and pamphlets of the special annual religious fete in his chambers in Tirupati on Tuesday evening. Temple DyEO Sri Subramanyam and AEO Sri Sankara Raju were also present.

The important days includes Moushika Vahanam on February 16 on the day of Ankurarpanam followed by Pallaki Utsavam,Hamsa Vahanam on February 17, Surya and Chandra Prabhas on February 18, Bhoota and Simha Vahanams on February 19, Makara and Sesha Vahanams on February 20, Adhikara Nandi and Tiruchi utsavams on February 21, Vyagra and Gaja vahanams on February 22, Kalpavriksha and Tiruchi on February 23, Rathotsavam and Nandi Vahanam of February 24, Purushamriga and Aswa vahanams with Kalyanotsavam on February 25, Nataraja Surya Prabha Vahanam and Ravanasura vahanam with Dhwajavarohanam on February 26.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీకపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల గోడపత్రికల ఆవిష్కరణ

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి 16 నుంచి 26వ తేదీ వరకు జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాల గోడపత్రికలు, కరపత్రాలను టిటిడి కార్యనిర్వహణాధికారి డా|| డి.సాంబశివరావు మంగళవారం సాయంత్రం ఆవిష్కరించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల ఈవో కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ శ్రీకపిలేశ్వరాలయ బ్రహ్మోత్సవాలకు ఫిబ్రవరి 16వ తేదీన అంకురార్పణం, ఫిబ్రవరి 17న ధ్వజారోహణం, ఫిబ్రవరి 24న మహాశివరాత్రి సందర్భంగా నంది వాహనం, ఫిబ్రవరి 25న శివపార్వతుల కల్యాణం జరుగనున్నాయని తెలిపారు. పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామి, అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఈ సందర్భంగా ఈవో కోరారు.

ఈ కార్యక్రమంలో తితిదే స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, ఏఈవో శ్రీ శంకరరాజు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.