HUGE RESPONSE TO TTD ONLINE QUOTA TICKETS శ్రీవారి ఆర్జిత సేవా ఆన్‌లైన్‌ టికెట్లకు భక్తుల నుండి విశేషస్పందన

Tirumala, 16 June 2017: Soon after the online quota of Arjitha Seva tickets for the month of September are released by TTD on Friday, thousands of pilgrim devotees from across the globe registered for the seva tickets.

As per the data available from 10am to 4pm on June 16, in the Premiere category which will be allotted through online dip including Suprabhatam, Thomala, Archana, Visesha Puja, Astadalam and Nijapadam which consists 10710 tickets, 30856 pilgrims registered. Among them 8810 preferred any seva on any date while 22046 opted for specific sevas on specified days. Meanwhile there were about 7104 new users who registered for online seva tickets. In the second category of seva tickets consisting 34186, from 10am to 4pm about 7242 registered.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీవారి ఆర్జిత సేవా ఆన్‌లైన్‌ టికెట్లకు భక్తుల నుండి విశేషస్పందన

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆన్‌లైన్‌ ఆర్జిత సేవా టికెట్లకు భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. సెప్టెంబర్‌ నెలకు సంబంధించి 44,896 ఆర్జిత సేవా టికెట్లను శుక్రవారం ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌ లో విడుదల చేసింది.

శ్రీవారి ఆర్జిత సేవలను ఆన్‌లైన్‌ డిప్‌ విధానం ద్వారా కేటాయంచే 10,710 టికెట్లకు

శుక్రవారం ఉదయం 10.00 నుండి సాయంత్రం 4.00 గంటల వరకు అందిన గణాంకాల ప్రకారం 30,856 మంది భక్తులు నమోదు చేసుకున్నారు. ఇందులో 22,046 మంది భక్తులు వారికి కావలసిన తేదీలు, సేవల వివరాలను నమోదు చేసుకోగా, 8,810 మంది టిటిడి కేటాయంచిన తేదీకి, కేటాయంచిన సేవలకు హాజరయ్యేందుకు రిజిష్ట్టర్‌ చేసుకున్నారు.

డిప్‌ విధానంతో కాకుండా ఆన్‌లైన్‌లో ఉన్న మిగిలిన 34,186 (కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జితబ్రహ్మూెత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలు) ఆర్జితసేవా టికెట్లలో శుక్రవారం సాయంత్రం 4.00 గంటల వరకు 7,242 టికెట్లను భక్తులు పొందారు. ఈ రోజు ఉదయం 10.00 నుండి సాయంత్రం 4.00 గంటల వరకు 7,104 మంది భక్తులు టిటిడి వెబ్‌సైట్‌లో కొత్తగా యూజర్లు అకౌంట్‌ పొందినట్లు ఐటి అధికారులు తెలిపారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.