TTD TO STRENGTHEN DHARMIKA SALAHA MANDALIS-TTD JEO BHASKAR – 7 జిల్లాలలో సంస్థాగతంగా ధార్మిక మండళ్ల పటిష్టానికి ప్రణాళికలు

Tirupati, 16 June 2017: With an aim to widespread the promotion and propagation of Hindu Sanatana Dharma in nook and corner of the Telugu speaking states, TTD is chalking out plans to strengthen Dharmika Salaha Mandalis present in each district, said Tirupati JEO Sri P Bhaskar.

The awareness program for program assistants in twin Telugu states was held in SVETA bhavan on Friday.

Speaking on this occasion, the JEO said, as a pilot project initially seven districts from these two states were selected which includes Nellore, Kadapa, Krishna, Chittoor, Vijayanagaram, Mehaboobnagar and Warangal will be strengthened at district level.

“Our focus is on youth. We are designing programmes using technology to attract youth. We also invite Dharmic Seva Organisations to take part voluntarily in this noble mission”, he added.

HDPP Secretary Sri Ramakrishna Reddy, Epic Studies Special Officer Sri Damodar Naidu were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

7 జిల్లాలలో సంస్థాగతంగా ధార్మిక మండళ్ల పటిష్టానికి ప్రణాళికలు : టిటిడి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో 7 జిల్లాలలో జిల్లాస్థాయి ధర్మప్రచార మండళ్లను సంస్థాపరంగా పటిష్టం చేసేందుకు ప్రణాళికలు రూపొందించామని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ వెల్లడించారు. తిరుపతిలోని శ్వేత భవనంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రోగ్రాం అసిస్టెంట్ల రెండు రోజుల అవగాహన సమావేశం శుక్రవారం ముగిసింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జెఈవో మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలలో ముందుగా 7 జిల్లాలను పైలెట్‌ ప్రాజెక్ట్‌ కింది గుర్తించి సంస్థాగతంగా పటిష్టం చేసేందుకు కార్యాచరణ రూపొందించామన్నారు. నెల్లూరు, కడప, కృష్ణ, చిత్తూరు, విజయనగరం మహబూబ్‌ నగర్‌, వరంగల్‌ జిల్లాలలో జూలై 31వ తేది నాటికి జిల్లా ధార్మిక మండళ్లను జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు సంస్థాగతంగా పటిష్టం చేసిన అనంతరం మిగిలిన జిల్లాలకు విస్తరిస్తామన్నారు. జిల్లా స్థాయి ధార్మిక మండళ్లు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి, తద్వారా కార్యక్రమాలు అమలుచేస్తే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు.

యువతను లక్ష్యంగా చేసుకుని మరింత ఆకర్షించేలా ధార్మిక కార్యక్రమాలు చేపట్టనున్నామన్నారు. టెక్నాలజీ ద్వారా హిందూ ధర్మప్రచార పరిషత్‌ను విస్తృతం చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. హిందూ ధర్మ పరిరక్షణకు స్వచ్చంధంగా పనిచేస్తున్న వివిధ సంస్థల సేవల సహకారం తీసుకోవాలన్నారు. భజనమండళ్లలో మరింత నాణ్యత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 23 జిల్లాలలో ప్రోగ్రాం అసిస్టెంట్లు మరింత ఉత్సాహంగా పనిచేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి శ్రీ ఎ.రామకృష్ణారెడ్డి, ఏపిక్‌ స్టడీస్‌ ప్రత్యేకాధికారి ఆచార్య దామోదర్‌ నాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.