HUMAN HAIR AUCTION_ తలనీలాల విక్రయం ద్వారా టిటిడి ఆదాయం రూ.10.48 కోట్లు

Tirumala, 7 June 2018: Out of 76,700 kilos of different varieties of human hair stock bid in e-Auction today held under the supervision of Tirumala JEO Sri KS Sreenivasa Raju 8,200 kilos of stock was bid fetching Rs.10.48cr revenue to TTD coffers.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

తలనీలాల విక్రయం ద్వారా టిటిడి ఆదాయం రూ.10.48 కోట్లు

జూన్‌ 07, తిరుమల 2018: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించిన తలనీలాల ఈ-వేలంలో టిటిడి రూ.10.48 కోట్ల ఆదాయాన్ని గడించింది.

ప్రతి నెలా మొదటి గురువారంనాడు తలనీలాల ఈ-వేలం జరుగుతున్న విషయం విదితమే. ఇందులో భాగంగా టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు పర్యవేక్షణలో తలనీలాల ఈవేలం జరిగింది. మొదటి, రెండు, మూడు, నాలుగు, తెల్లవెంట్రుకలు తలనీలాల రకాల ఈ-వేలం నిర్వహించారు. ఈ నెల నిర్వహించిన ఈ-వేలంలో మొత్తం 8,200 కిలోల తలనీలాలు అమ్ముడుపోయాయి.

తలనీలాలలో మొదటి రకం(31 ఇంచుల పైన), రెండో రకం(16 నుండి 30 ఇంచులు), నాలుగో రకం(5 నుండి 9 ఇంచుల వరకు), ఐదో రకం( 5 ఇంచుల కన్నా తక్కువ), తెల్లవెంట్రుకల రకాలను టిటిడి ఈ-వేలంలో పెట్టింది.

కిలో రూ.22,494/-గా ఉన్న మొదటి రకం తలనీలాలను మొత్తం 8,500 కిలోలను వేలానికి ఉంచగా 500 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.1.12 కోట్ల ఆదాయం సమకూరింది.

కిలో రూ.17,223/-గా ఉన్న రెండో రకం తలనీలాలను మొత్తం 43,100 కిలోలను వేలానికి ఉంచగా 5,300 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.9.13 కోట్ల ఆదాయం వచ్చింది.

కిలో రూ.1,469/-గా ఉన్న నాలుగో రకం తలనీలాలను మొత్తం 1,100 కిలోలను వేలానికి ఉంచగా ఏవీ అమ్ముడుపోలేదు.

కిలో రూ.36/-గా ఉన్న ఐదో రకం తలనీలాలను 17,000 కిలోలను వేలానికి ఉంచగా 2,000 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.72 వేల ఆదాయం సమకూరింది.

కిలో రూ.5,462/-గా ఉన్న తెల్ల వెంట్రుకలను 7,000 కిలోలను అమ్మకానికి ఉంచగా 400 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.21.85 లక్షల ఆదాయం లభించింది.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.