SRI KRT FESTIVALS_ శ్రీ కోదండరామస్వామివారి ఆలయాలలో జూన్ నెలలో విశేష ఉత్సవాలు
Tirupati, 7 June 2018: The important festival occasions in Sri Kodanda Rama Swamy temple in the month of June are as follows:
June 9,16,23,30-Abhishekam to Mula Virat on payment of Rs.20 per ticket per person.
June 13-Sahasra Kalasabhishekam on the day of dark phase of moon, evening procession of Hanumantha Vahanam
June 16-Sita Rama Kalyanam on the advent of Punarvasu star by 11am with Rs.500 per ticket on which two persons will be allowed.
June 28-Astottara Satakalasabhishekam on the occasion of full moon day on payment of Rs.50 per ticket per person.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
శ్రీ కోదండరామస్వామివారి ఆలయాలలో జూన్ నెలలో విశేష ఉత్సవాలు
తిరుపతి, 2018 జూన్ 07: టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో జూన్ నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
– జూన్ 9, 16, 23, 30వ తేదీల్లో శనివారం కావడంతో ఉదయం 6.00 గంటలకు మూలవర్లకు అభిషేకం నిర్వహిస్తారు. రూ.20/- చెల్లించి ఒక్కరు పాల్గొనవచ్చు. సాయంత్రం 6.00 గంటలకు శ్రీసీతా లక్ష్మణ సమేత కోదండరామస్వామివారు బంగారు తిరుచ్చిలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారు. అనంతరం రాత్రి 7.00 గంటలకు ఆలయంలో ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.
– జూన్ 13వ తేదీ అమావాస్యను పురస్కరించుకుని ఆలయంలో ఉదయం 6.00 గంటలకు సహస్ర కలశాబిషేకం జరుగుతుంది. గృహస్తులు (ఇద్దరు) రూ.500/చెల్లించి ఈ సేవలో పాల్గొనవచ్చు. అనంతరం రాత్రి 7.00 గంటలకు శ్రీ కోదండరామస్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
– జూన్ 16వ తేదీన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆలయంలో ఉదయం 11.00 గంటలకు శ్రీ సీతారామ కల్యాణం వైభవంగా నిర్వహిస్తారు. గృహస్తులు (ఇద్దరు) రూ.500/- చెల్లించి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు.
– జూన్ 28వ తేదీ పౌర్ణమి నాడు ఆలయంలో అష్టోత్తర శతకలశాభిషేకం జరుగనుంది. రూ.50/ చెల్లించి ఒక్కరు పాల్గొనవచ్చు. ఈ సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామివారిని నాలుగు మాడ వీధుల ద్వారా రామచంద్ర పుష్కరిణి వరకు ఊరేగింపు, ఆస్థానం నిర్వహిస్తారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.