TTD MAKES A REVENUE OF RS.3.85CR_ తలనీలాల విక్రయం ద్వారా టిటిడి ఆదాయం రూ. 3.85 కోట్లు

TTD MAKES A REVENUE OF RS.3.85CR

The e-auction of human hair has fetched a revenue of Rs.3.85cores to TTD.

About 3,700kilos of various varieties of human hair was bid in the auctin held on Thursday under the supervision of Tirumala JEO Sri KS Sreenivasa Raju.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తలనీలాల విక్రయం ద్వారా టిటిడి ఆదాయం రూ. 3.85 కోట్లు

తిరుమల, 2019 జూన్ 06: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించిన తలనీలాల ఈ-వేలం గురువారం నిర్వ‌హించారు. త‌ద్వారా టిటిడి రూ. 3.85 కోట్ల ఆదాయాన్ని గడించింది.

ప్రతినెలా మొదటి గురువారం నాడు తలనీలాల ఈ-వేలం జరుగుతున్న విషయం విదితమే. ఇందులోభాగంగా టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు పర్యవేక్షణలో తలనీలాల ఈ వేలం జరిగింది. మొదటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, తెల్లవెంట్రుకలు తలనీలాల రకాల ఈ-వేలం నిర్వహించారు. ఈ నెల నిర్వహించిన ఈ-వేలంలో మొత్తం 3,700 కిలోల తలనీలాలు అమ్ముడుపోయాయి.
తలనీలాలలో మొదటి రకం(27 ఇంచుల పైన), రెండో రకం(19 నుండి 26 ఇంచులు), మూడో రకం(10 నుండి 18 ఇంచులు), నాలుగో రకం(5 నుండి 9 ఇంచులు), ఐదో రకం(5 ఇంచుల కన్నా తక్కువ) టిటిడి ఈ-వేలంలో పెట్టింది.

మొదటి ర‌కం తలనీలాలో కిలో రూ.26,005/-గా ఉన్న ఏ క్యాట‌గిరి – 4,200 కిలోలను వేలానికి ఉంచగా, ఏవీ అమ్ముడుపోలేదు. కిలో రూ. 18,333/-గా ఉన్న బి క్యాట‌గిరి – 300 కిలోలను వేలానికి ఉంచగా, ఏవీ అమ్ముడుపోలేదు.

రెండో రకం తలనీలాలో కిలో రూ.17,812/-గా ఉన్న ఏ క్యాట‌గిరి – 3,800 కిలోలను వేలానికి ఉంచగా 1,300 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.231.56 లక్షల ఆదాయం సమకూరింది. అదేవిధంగా కిలో రూ. 8,607/-గ‌ఆ ఉన్న బి క్యాట‌గిరి – 4,500 కిలోలు వేలానికి ఉంచగా 800 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.68.86 ల‌క్ష‌ల‌ ఆదాయం లభించింది.

మూడో రకం తలనీలాలో కిలో రూ.6,032/-గా ఉన్న ఏ క్యాట‌గిరి 800 కిలోలను వేలానికి ఉంచారు. అన్నీ అమ్ముడుపోయాయి. తద్వారా రూ.48.32 లక్షల ఆదాయం లభించింది. కిలో రూ.4,554/-గా ఉన్న బి క్యాట‌గిరి – 20,900 కిలోలు వేలానికి ఉంచగా 800 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.36.43 ల‌క్ష‌ల‌ ఆదాయం సమకూరింది.

కిలో రూ.1,801/-గా ఉన్న నాలుగో రకం తలనీలాలను 5,500 కిలోలను వేలానికి ఉంచారు. ఏవీ అమ్ముడుపోలేదు.

కిలో రూ.37/-గా ఉన్న ఐదో రకం తలనీలాలను 51,000 కిలోలను వేలానికి ఉంచారు. ఏవీ అమ్ముడుపోలేదు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.