MAHASAMPROKSHANAM RITUAL AT SKVST_ శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Tirupati, 6 June 2019: As part of Astabandhana Balalaya Maha samprokshanam event at Sri Kalyana Venkateswara Swamy temple in Srinivasa Mangapuram from June 9 to 13, TTD conducted the traditional ritual of Koil Alwar Thirumanjanam in on Thursday.

After the Agama traditions the temple was opened up for devotees darshan from 12.00 noon onwards. Earlier the TTD also cancelled arjita sevas like Thirupavada seva and kalyanotsava seva today.

DONATIONS

Tirupati based devotee Sri Narasimhulu has donated four Paradalu and two Kuralas for use in the temple.

On June 8, Ankurarpanam ritual will be performed as part of Maha samprokshanam in the evening.

DyEO Sri Dhananjay, Superintendent Sri Ramanaiah, temple inspector Sri Anil, temple archakas, and other officials participated.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుపతి, 2019 జూన్ 06: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో గురువారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆల‌యంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ సంద‌ర్భంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించారు. ఆలయంలో జూన్ 9 నుండి 13వ తేదీ వరకు మహాసంప్రోక్షణ నిర్వ‌హించ‌నున్నారు.

ఈ సందర్భంగా గురువారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహించారు. ఉదయం 6.30 నుండి 11.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. మ‌ధ్యాహ్నం 12.00 గంటల నుండి భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం సందర్భంగా ఆలయంలో ఆర్జిత సేవలైన తిరుప్పావడసేవ, కల్యాణోత్సవం రద్దు చేశారు.

పరదాలు విరాళం :

తిరుపతికి చెందిన శ్రీ నరసింహులు నాలుగు పరదాలు, రెండు కురాళాలను ఆలయానికి విరాళంగా అందించారు. రానున్న బ్రహ్మోత్సవాల్లో వీటిని వినియోగించనున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ ధ‌నంజ‌యులు, సూపరింటెండెంట్‌ శ్రీ ర‌మ‌ణ‌య్య‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ అనిల్‌, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

జూన్‌ 8న అంకురార్పణ :

– ఆల‌యంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణకు జూన్‌ 8వ తేదీ శనివారం ఉదయం 8.00 గంటలకు ఆచార్య రుత్విక్‌వరణం, రాత్రి 7.00 గంటలకు మేదినిపూజ, వాస్తుహోమం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ నిర్వహిస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.