HUMAN HAIR FETCHES RS. 6 crores TO TTD_ తలనీలాల విక్రయం ద్వారా టిటిడి ఆదాయం రూ.6.01 కోట్లు
Tirumala, 4 Jul. 19: TTD procured a revenue of Rs. 6 crores in the e-Auction of human hair held on Thursday.
In this auction held today about 76, 500 kilos of all varieties of hair were auctioned.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI
తలనీలాల విక్రయం ద్వారా టిటిడి ఆదాయం రూ.6.01 కోట్లు
తిరుమల, 2019 జూలై 04: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించిన తలనీలాల ఈ-వేలంలో టిటిడి రూ.6.01 కోట్ల ఆదాయాన్ని గడించింది.
ప్రతి నెలా మొదటి గురువారంనాడు తలనీలాల ఈ-వేలం జరుగుతున్న విషయం విదితమే. మొదటి, రెండు, మూడు, నాలుగు, తెల్లవెంట్రుకలు తలనీలాల రకాల ఈ-వేలం నిర్వహించారు. ఈ నెల నిర్వహించిన ఈ-వేలంలో మొత్తం 76,500 కిలోల తలనీలాలు అమ్ముడుపోయాయి.
తలనీలాలలో మొదటి రకం(27 ఇంచుల పైన), రెండో రకం(19 నుండి 26 ఇంచులు), మూడో రకం(10 నుండి 18 ఇంచులు), నాలుగో రకం(5 నుండి 9 ఇంచులు), ఐదో రకం(5 ఇంచుల కన్నా తక్కువ) టిటిడి ఈ-వేలంలో పెట్టింది.
మొదటి రకం తలనీలాలో కిలో రూ.26,005/-గా ఉన్న ఏ క్యాటగిరి – 4,600 కిలోలను వేలానికి ఉంచగా, ఏవీ అమ్ముడుపోలేదు. కిలో రూ. 18,333/-గా ఉన్న బి క్యాటగిరి – 1000 కిలోలను వేలానికి ఉంచగా 200 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.36.66 లక్షల ఆదాయం లభించింది.
రెండో రకం తలనీలాలో కిలో రూ.17,814/-గా ఉన్న ఏ క్యాటగిరి – 4,400 కిలోలను వేలానికి ఉంచగా 1,500 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.267.21 లక్షల ఆదాయం సమకూరింది. అదేవిధంగా కిలో రూ. 8,607/-గా ఉన్న బి క్యాటగిరి – 7,000 కిలోలు వేలానికి ఉంచగా 2,100 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.180.76 లక్షల ఆదాయం లభించింది.
మూడో రకం తలనీలాలో కిలో రూ.6,041/-గా ఉన్న ఏ క్యాటగిరి 1,400 కిలోలను వేలానికి ఉంచారు. అన్నీ అమ్ముడుపోయాయి. తద్వారా రూ.84.65 లక్షల ఆదాయం లభించింది. కిలో రూ.4,554/-గా ఉన్న బి క్యాటగిరి – 22,900 కిలోలు వేలానికి ఉంచగా, ఏవీ అమ్ముడుపోలేదు.
కిలో రూ.1,801/-గా ఉన్న నాలుగో రకం తలనీలాలను 6,600 కిలోలను వేలానికి ఉంచగా 300 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.5.40 లక్షల ఆదాయం లభించింది.
కిలో రూ.37/-గా ఉన్న ఐదో రకం తలనీలాలను 71,000 కిలోలను వేలానికి ఉంచగా అన్నీఅమ్ముడుపోయాయి. తద్వారా రూ.27 లక్షల ఆదాయం లభించింది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.