TTD CHAIRMAN ASSURES MORE FURNISHED MEDICARE TO THE INJURED SRIVARI SEVAK_ గాయ‌ప‌డిన శ్రీ‌వారి సేవ‌కునికి మెరుగైన వైద్య‌సేవ‌లు అందిస్తాం : టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి

Tirupati, 4 Jul. 19: In a humane gesture, TTD Trust Board Chief Sri YV Subba Reddy assured of more furnished medicare to the ailing Srivari Sevak who accidentally fell from the second floor of Seva Sadan and critically injured in the mishap.

The Chairman along with MLA of Chandragiri Sri C Bhaskar Reddy visited the ailing volunteer Sri M Suman, aged 28 from Peddapalle district (Karimnagar) district of Telangana who is undergoing treatment in ICU ward at SVIMS.

After consoling the patient and his family members, the Chairman speaking to media said, the young man who works as a mechanic hails from a poor family. He is the lone bread earner for his family of an ailing mother.

“Inspite of his poverty, he came to render service and, unfortunately, met with the accident. We are ready to provide the best of treatment to bring him back to normalcy”, he added.

SVIMS Doctors Dr Vengamma, Dr Hanumantha Rao, Dr Vikas, TTD CMO Dr Nageswara Rao, Dr Kusuma Kumari and others were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

గాయ‌ప‌డిన శ్రీ‌వారి సేవ‌కునికి మెరుగైన వైద్య‌సేవ‌లు అందిస్తాం : టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి

తిరుప‌తి, 2019 జూలై 04: తిరుమ‌ల‌లోని శ్రీ‌వారి సేవా స‌ద‌న్‌లో రెండో అంత‌స్తు నుండి ప్ర‌మాద‌వ‌శాత్తు కింద‌ప‌డి తీవ్రంగా గాయ‌ప‌డిన శ్రీ‌వారి సేవ‌కునికి మెరుగైన వైద్య‌సేవ‌లు అందించి పూర్తిగా కోలుకునేలా చేస్తామ‌ని టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి హామీ ఇచ్చారు. తిరుప‌తిలోని స్విమ్స్ ఆసుప‌త్రి ఐసియు వార్డులో చికిత్స పొందుతున్న తెలంగాణ రాష్ట్రం పెద్ద‌ప‌ల్లి జిల్లాకు చెందిన శ్రీ‌వారి సేవ‌కుడు శ్రీ ఎం.సుమ‌న్‌(28)ను గురువారం సాయంత్రం చంద్ర‌గిరి ఎమ్మెల్యే డా.. చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డితో క‌లిసి ఛైర్మ‌న్ ప‌రామ‌ర్శించారు. అత‌ని కుటుంబ స‌భ్యుల‌ను ఓదార్చారు. త‌క్ష‌ణ సాయంగా సొంతంగా రూ.10 వేలు న‌గ‌దు అందించారు.

అనంత‌రం టిటిడి ఛైర్మ‌న్ మీడియాతో మాట్లాడుతూ పేద కుటుంబానికి చెందిన, మెకానిక్‌గా ప‌నిచేస్తున్న‌సుమ‌న్‌కు త‌ల్లి, ఇద్ద‌రు చెల్లెళ్లు ఉన్నార‌ని, ఇత‌ని సంపాద‌నే ఆ కుటుంబానికి జీవ‌నాధార‌మ‌ని చెప్పారు. స్వామివారిపై భ‌క్తితో పేద‌రికంలోనూ శ్రీ‌వారి సేవ‌కు రావ‌డం గొప్ప విష‌య‌మ‌న్నారు. దుర‌దృష్ట‌వ‌శాత్తు ప్ర‌మాదం జ‌రిగింద‌ని చెప్పారు. ఈ యువ‌కుడు పూర్తిగా కోలుకునేందుకు అవ‌స‌ర‌మైన పూర్తి స‌హాయ స‌హాకారాలు అందిస్తామ‌ని తెలిపారు.

టిటిడి ఛైర్మ‌న్ వెంట స్విమ్స్ డాక్ట‌ర్లు డా.. వెంగ‌మ్మ‌, డా…హ‌నుమంత‌రావు, డా.. వికాస్‌, టిటిడి సిఎంఓ డా..నాగేశ్వ‌ర‌రావు, డా.. కుసుమ‌కుమారి ఇత‌ర అధికారులు ఉన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.