TTD NETS RS.7.15CR IN THE E AUCTION OF 9900 KILOS OF ALL VARIETIES OF HUMAN HAIR_ తలనీలాల విక్రయం ద్వారా టిటిడి ఆదాయం రూ.7.15 కోట్లు

Tirumala, 2 November 2017: TTD NETS RS.7.15CR IN THE E AUCTION OF 9900 KILOS OF ALL VARIETIES OF HUMAN HAIR BID IN E-AUCTION TODAY UNDER THE SUPER VISION TIRUMALA JEO SRI KS SREENIVASA RAJU.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD,TIRUPATI

తలనీలాల విక్రయం ద్వారా టిటిడి ఆదాయం రూ.7.15 కోట్లు

తిరుమల, 2017 నవంబరు 02: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించిన తలనీలాల ఈ-వేలంలో టిటిడి రూ.7.15 కోట్ల ఆదాయాన్ని గడించింది.

ప్రతినెలా మొదటి గురువారం నాడు తలనీలాల ఈ వేలం జరుగుతున్న విషయం విదితమే. ఇందులోభాగంగా టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు పర్యవేక్షనలో తలనీలాల ఈ వేలం జరిగింది. మొదటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, తెల్లవెంట్రుకలు తలనీలాల రకాల ఈ-వేలం నిర్వహించారు. ఈ నెల నిర్వహించిన ఈ-వేలంలో మొత్తం 9,900 కిలోల తలనీలాలు అమ్ముడుపోయాయి.

తలనీలాలలో మొదటి రకం(31 ఇంచుల పైన), రెండో రకం(16 నుండి 30 ఇంచులు), మూడో రకం(10 నుండి 15 ఇంచులు), నాలుగో రకం(5 నుండి 9 ఇంచులు), ఐదో రకం(5 ఇంచుల కన్నా తక్కువ), తెల్లవెంట్రుకల రకాలను టిటిడి ఈ-వేలంలో పెట్టింది.

కిలో రూ.22,494/-గా ఉన్న మొదటి రకం తలనీలాలను మొత్తం 9,700 కిలోలను వేలానికి ఉంచగా 400 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.89.98 లక్షల ఆదాయం సమకూరింది.

కిలో రూ.17,223/-గా ఉన్న రెండో రకం తలనీలాలను మొత్తం 60,000 కిలోలను వేలానికి ఉంచగా 2,900 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.4.99 కోట్ల ఆదాయం సమకూరింది.

కిలో రూ.2,833/-గా ఉన్న మూడో రకం తలనీలాలను మొత్తం 31,000 కిలోలను వేలానికి ఉంచారు. ఇందులో 4,300 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.1.21 కోట్ల ఆదాయం లభించింది.

కిలో రూ.1,194/-గా ఉన్న నాలుగో రకం తలనీలాలను 1,900 కిలోలను వేలానికి ఉంచారు. 300 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.3.6 లక్షల ఆదాయం వచ్చింది.

కిలో రూ.24/-గా ఉన్న ఐదో రకం తలనీలాలను 1,64,000 కిలోలను వేలానికి ఉంచగా 2000 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.48 వేల ఆదాయం సమకూరింది.

కిలో రూ.5,462/-గా ఉన్న తెల్ల వెంట్రుకలను 6,600 కిలోలను అమ్మకానికి ఉంచారు. ఏవీ అమ్ముడుపోలేదు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.