I-DAY CELEBRATED WITH PATRIOTIC FERVOUR IN TIRUMALA _ తిరుమలలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం
తిరుమలలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం
తిరుమల, 2012 ఆగస్టు 15: తిరుమలలో 66వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం జెండా పండుగ అత్యంత వైభవంగా జరిగింది. విజిలెన్స్ కార్యాలయం ఎదుట జరిగిన ఈ వేడుకల్లో తిరుమల జెఈఓ శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు ముఖ్య అతిథిగా పాల్గొని వినీలాకాశంలో మువ్వన్నెల జెండాను లాంఛనంగా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్ర భారతావని కోసం ఎందరో మహనీయులు నిబద్ధతతో పనిచేసి ఎన్నో త్యాగాలు చేశారన్నారు. తితిదే సిబ్బంది కూడా అలాంటి నిబద్ధతతో భక్తులకు సేవలందించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల నిర్వహించిన మనగుడి కార్యక్రమంలో 68 లక్షల మంది భక్తులు పాల్గొన్నట్టు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని నిర్వహించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. భవిష్యత్తులో భక్తుల అవసరాల దృష్ట్యా తితిదే సాంకేతికంగా కూడా దర్శన మరియు వసతి కల్పన విధానాల్లో పెనుమార్పులు తీసుకొస్తున్నదని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తితిదే అడిషనల్ సివిఎస్‌ఓ శ్రీ శివకుమార్‌రెడ్డి, ఇఇలు శ్రీ జగన్‌మోహన్‌రెడ్డి, శ్రీ నరసింహమూర్తి, శ్రీ మనోహర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.