IAS TRAINEES MEET TTD EO / టిటిడి ఈవోను కలిసిన ట్రైనీ ఐఏఎస్‌లు
Tirupati, 7 February 2017: A team of 18-member IAS trainee batch formally met TTD EO in his chambers in TTD administrative building in Tirupati on Tuesday.
The EO explained them about various developmental activities undertaken by TTD and the amenities including darshan, accommodation, laddu prasadam, tonsuring etc. activities provided by TTD to pilgrims with the help of technology in a transparent manner.
The TTD administrative chief also informed them about the Annaprasadam, importance given to sanitation, free medical services, trusts and scheme, trasnport etc. being carried out by TTD in the most efficient way.
Earlier they met Tirumala JEO Sri KS Sreenivasa Raju and All Projects Special Officer Sri N Muktheswara Rao in SPRH, Tirupati who explained them about the various activities in Tirumala and working of various projects respectively.
టిటిడి ఈవోను కలిసిన ట్రైనీ ఐఏఎస్‌లు
శిక్షణలో భాగంగా 18 మంది ట్రైనీ ఐఏఎస్‌ల బృందం మంగళవారం టిటిడి ఈవో డా|| డి.సాంబశివరావును మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల కార్యాలయంలో ఈవోను కలిసి వివిధ విభాగాలలో జరుగుతున్న కార్యక్రమాలను తెలుసుకున్నారు.
టిటిడి అమలుచేస్తున్న విద్య, వైద్య, సంక్షేమ కార్యక్రమాల గురించి ఈవో ఈ సందర్భంగా ట్రైనీ ఐఏఎస్‌లకు వివరించారు. టెక్నాలజీ సాయంతో పారదర్శకంగా భక్తులకు అందిస్తున్న సేవలు, లడ్డూ ప్రసాదాల పంపిణీ, వసతి, ప్రత్యేక ప్రవేశదర్శన కాంప్లెక్స్, దివ్యదర్శనం కాంప్లెక్స్‌లలో భక్తులకు అందుతున్న సేవలు, ఆన్‌లైన్ సేవలు, ఈ-డొనేషన్, ఈ-హుండీ, క్యూలైన్ల నిర్వహణ, ఆర్వో వాటర్ ప్లాంట్లు, వైద్యసేవలు, అన్నప్రసాదాల వితరణ, తయారీ, వంటలకు సరిపడా సరుకుల నిల్వ, సేకరణ, పారిశుద్ధ్యం, ప్రహరీ ఉద్యానవనాలు, రవాణా, టిటిడి స్థానికాలయాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, టిటిడిలో పరిపాలన క్రమశ్రేణి, అధికారుల బాధ్యతలు, సిబ్బంది పనితీరు తదితర అంశాలను వారికి వివరించారు.
అంతకుముందు తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో తిరుమల జెఈవో శ్రీ కెఎస్.శ్రీనివాసరాజు ట్రైనీ ఐఏఎస్‌లకు టిటిడిలో జరుగుతున్న కార్యక్రమాలను వివరించారు. అనంతరం ప్రాజెక్ట్‌ల ప్రత్యేకాధికారి శ్రీ ముక్తేశ్వరరావు టిటిడి ప్రాజెక్ట్‌ల పనితీరు, ఆధ్యాత్మిక కార్యక్రమాల వివరాలను తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిటిడి ట్రాన్స్‌పోర్ట్ జిఎం శ్రీ శేషారెడ్డి, డిప్యూటీ ఈవో శ్రీమతి శారద, క్యాటరింగ్ అధికారి శ్రీ శాస్త్రి పాల్గొన్నారు.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI