“IDENTIFY EXPERT ARTIST TROUPES FROM ACROSS THE COUNTRY”-TTD EO_ శ్రీవారి బ్రహ్మూెత్సవాలలో అన్ని రాష్ట్రాల కళా బృందాలకు అవకాశం టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Tirupati, 4 December 2017: While appreciating the unique art forms exhibited by some artist troupes hailing from Telengana, Tamilnadu and Karnataka during the recent Tiruchanoor Brahmotsavams, TTD EO Sri Anil Kumar Singhal, instructed the officials concerned to identify such expert artiste teams from other parts of the country also for the Tirumala brahmotsavams next year.

The review meeting with HoDs on various developmental activities was held in the conference hall of TTD administrative building in Tirupati on Monday by TTD EO along with JEOs Sri KS Sreenivasa Raju, Sri P Bhaskar and CVSO Sri A Ravikrishna. The EO directed the HDPP wing to write letters to the Chief Secretaries of the states in the country seeking them to send their cultural troupes which are significant in their respective states.

The EO also instructed the Accounts department officials to negotiate with the concerned officials to facilitate the Indian Domestic card schemes like RuPay, Bheem card and net banking under payment gate way mode in the interests of the pilgrims.

The EO said, the new number of FMS call centre 1800 425 111 111 should be printed in all the accommodation receipts including online reservation, so that the pilgrims will have information about the new call centre. The officials should identify the majority complaints and should resolve them in a speedy way, he added.

TTD EO also complimented the PA system given to all the art troupes during the recent Padmavathi Ammavaru annual fete and instructed the engineering officials to make a trial-run of PA system in the next Pournami Garuda Seva in Tirumala to find out audio frequency levels in galleries. He also instructed the electrical wing to come out with an action plan of the lighting for Tirumala temple and Four mada streets.

TTD Administrative chief is all praise for the perfect management of queue line inside Tirumala temple and informed the concerned to find out much better ways for the comfortable darshan of pilgrims. He said, the master data on TTD properties should be prepared by Decemeber by March next in a full-fledged manner. The EO also directed the Chief Editor of Sapthagiri Dr Radha Ramana to ensure that there will be no delay in dispatching Sapthagiri magazine to the subscribers on time.

CE Sri Chandra Sekhar Reddy, FACAO Sri Balaji, all HoDs were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI

శ్రీవారి బ్రహ్మూెత్సవాలలో అన్ని రాష్ట్రాల కళా బృందాలకు అవకాశం టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

డిసెంబరు 04, తిరుపతి, 2017: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి వాహనసేవలలో దేశంలోని అన్ని రాష్ట్రాల కళాకారులకు అవకాశం కల్పించాలని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల సమావేశ మందిరంలో సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్బంగా ఈవో మాట్లాడుతూ 2018 శ్రీవారి బ్రహ్మూెత్సవాలలోపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో సంప్రదించి, ఆయా రాష్ట్రాలలోని ఉత్తమ కళాబృందాలకు స్వామివారి వాహనసేవలలో అవకాశం కల్పిస్తామని ఆయా ప్రభుత్వాలకు తెలియజేయాలన్నారు. శ్రీవారి ఆలయంలో క్యూలైన్లు బాగా ఉన్నాయని, ఇందుకు సంబంధించి భక్తులు మరింత సంతృప్తి చెందేలా క్యూలైన్లలో మార్పులు తీసుకురావాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. రాబోవు బ్రహ్మూెత్సవాలలో శ్రీవారి ఆలయం, మాడ వీధులు, తిరుమలలోని ఇతర ప్రాంతాలలో విద్యుత్‌ అలంకరణ, లైటింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లపై మార్చి నాటికి ప్రణాళికలు రూపొందించాలన్నారు. టిటిడి ఆస్తులకు సంబంధించిన సమాచారంతో మాస్టర్‌ డేటాను తయారు చేయాలని, డిసెంబరు నెల చివరినాటికి మెదటిదశ, 2018 మార్చి 31వ తేదీ నాటికి డేటా పూర్తి చేయాలని ఆదేశించారు.

తిరుమలలో గదుల నిర్వహణకు సంబంధించి భక్తుల నుండి అభిప్రాయ సేకరణ చేయాలని, అదేవిధంగా ఎఫ్‌ఎమ్‌ఎస్‌ ద్వారా అందిన సమస్యలను త్వరత గతిన పరిష్కరించాలని ఆదేశించారు. గదుల నిర్వహణపై భక్తులకు ముందస్తు సమాచారం అందేలా టిటిడి వెబ్‌సైట్‌లో గదుల బుకింగ్‌ సమయంలోనే ఎఫ్‌ఎమ్‌ఎస్‌ టోల్‌ ఫ్రీ నెంబర్‌ కనిపించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గదుల నిర్వహణకు సంబంధించి ఎక్కువ ఫిిర్యాదులు అందింన అంశాలపై అధికారులు దృష్టి పెట్టాలని, తద్వారా సమస్యలు సత్వరం పరిష్కరించడానికి వీలవుతుందన్నారు. టిటిడి సేవలకు సంబంధించిన చెల్లింపుల కోసం నెట్‌ బ్యాకింగ్‌తో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూపేకార్డు, భీమ్‌యాప్‌ను గేట్‌వేగా వినియోగించుకోవాలని అకౌంట్స్‌ అధికారులను ఆదేశించారు.

అదేవిధంగా తిరుచానూరు బ్రహ్మూెత్సవాలలో కళాబృందాలకు టిటిడి మొదటి సారిగా అందించిన సంచార మ్యూజిక్‌ సిస్టం ( పోర్టబుల్‌ యాంప్లిఫైయర్‌ ఆడ్రస్‌ సిస్టం)ను తిరుమలలో రాబోవు శ్రీవారి పౌర్ణమి గరుడసేవకు ప్రయోగాత్మకంగా పరిశీలించాలన్నారు. ఈ మ్యూజిక్‌ సిస్టం ద్వారా వచ్చే సంగీతం గ్యాలరీలోని భక్తులకు ఎంత దూరం వరకు వినపడుతుందనే విషయాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. సప్తగిరి మాసపత్రిక చందా దారులందరికి సకాలంలో అందేెలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, సివిఎస్వో శ్రీ ఆకే.రవికృష్ణ, సిఇ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎఫ్‌ఎ అండ్‌ సిఎవో శ్రీ బాలాజీ, అదనపు సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌ రెడ్డి, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.