PUJA TO HUMAN HAIR STORAGE BUILDING HELD IN TIRUPATI_ తలనీలాల నూతన గోడౌన్‌లో టిటిడి ఈవో పూజలు

Tirupati, 4 December 2017: Special Puja has been performed to the new Human Hair storage godown which was built at a cost of Rs.6cr in Tirupati on Monday.

Speaking on this occasion, the TTD EO Sri Anil Kumar Singhal said, “henceforth Sorting, drying and storage will be carried out in a Scientific way in this godown. Every year nearly 330 tonnes of human hair is generated from the hair offerings made by pilgrims. Segregation of hair takes place in first Floor, Storage in Second floor and the process of drying in Third Floor. Every year we are procuring Rs.100 crores out of e-Auction of human hair. To make this e-platform more effective we also had negotiations with human hair exporters and manufacturers”, EO added.

TTD JEOs Sri KS Sreenivasa Raju, Sri P Bhaskar, CVSO Sri A Ravikrishna, CE Sri Chandrasekhar Reddy, SE I Sri M Ramesh Reddy, EEs Sri Manoharam, Sri Srinivasa Rao were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI

తలనీలాల నూతన గోడౌన్‌లో టిటిడి ఈవో పూజలు

డిసెంబరు 04, తిరుపతి, 2017: శ్రీవారికి భక్తులు సమర్పిస్తున్న తలనీలాలను నిల్వ ఉంచేందుకు తిరుపతిలోని హరేరామ హరేకృష్ణ ఆలయం రోడ్డులో టిటిడి నిర్మించిన నూతన గోడౌన్‌లో ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ సోమవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, సివిఎస్‌వో శ్రీ ఆకే రవికృష్ణ ఈ పూజల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ 4,949 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 450 మెట్రిక్‌ టన్నుల తలనీలాలను నిల్వ ఉంచుకునేందుకు వీలుగా రూ.6 కోట్ల వ్యయంతో ఈ గోడౌన్‌ నిర్మించినట్టు తెలిపారు. ఇందులో మొదటి అంతస్తులో 2 లోడింగ్‌, అన్‌లోడింగ్‌ హాళ్లు, తలనీలాలను వేరు చేసేందుకు 2 హాళ్లు, రెండో అంతస్తులో 3 స్టోరేజి గదులు, మూడో అంతస్తులో తలనీలాలను ఆరబెట్టేందుకు 3 హాళ్లు ఉన్నాయని వివరించారు. తలనీలాల ఈ-వేలం ద్వారా సంవత్సరానికి సుమారు రూ.100 కోట్ల ఆదాయం లభిస్తోందని తెలిపారు. ఈ-వేలం ద్వారా ఆదాయాన్ని మరింత పెంచుకునేందుకు ఎగుమతిదారులు, వ్యాపారులతో ఇటీవల సమావేశం కూడా నిర్వహించామన్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, అదనపు సివిఎస్‌వో శ్రీశివకుమార్‌రెడ్డి, ఎస్‌ఇ-1 శ్రీ రమేష్‌రెడ్డి, ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, ఎస్‌ఇ(ఎలక్ట్రికల్స్‌) శ్రీ వేంకటేశ్వర్లు, ఇఇ(వేలం) శ్రీ శ్రీనివాసరావు, ఇఇ శ్రీ మనోహర్‌, డెప్యూటీ ఇఇ శ్రీ చంద్రశేఖర్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.