IMPLEMENT COVID GUIDELINES STRICTLY- TTD CHAIRMAN _ కోవిడ్ నిబంధనలు మరింత కఠినంగా అమలు పరచండి – అధికారులతో టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి సమీక్ష

Tirumala, 09 January 2022: TTD Chairman Sri YV Subba Reddy has instructed officials to implement Covid guidelines strictly during the ten-day Vaikunta Dwara darshans and ensure placement of sanitisers at all the vital areas in Tirumala where the movement of pilgrims us more.

 

Reviewing the implementation of the Covid-19 guidelines at his camp office in Tirumala on Sunday evening with Additional EO Sri AV Dharma Reddy and others the TTD Chairman directed officials to ensure the health safety of devotees and employees during Vaikunta Ekadasi/Dwadasi on January 13&14 and the remaining days as well.

 

He said sanitisers should be placed at the Vaikuntam queue complex and Srivari Temple within reach of devotees and every devotee and employee should wear masks.

 

He asked officials to conduct an awareness campaign if necessary among devotees and employees. The arrangements should be made to observe social distancing in the queue lines and there should be no hassles etc.

 

He also appealed to devotees to observe all Covid guidelines without fail and co-operate with officials and employees.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

కోవిడ్ నిబంధనలు మరింత కఠినంగా అమలు పరచండి
– తిరుమలలో జనసమూహ ప్రాంతాల్లో శానిటైజర్లుఅందుబాటులో ఉంచాలి
– అధికారులతో టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి సమీక్ష

తిరుమల 9 జనవరి 2022: దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైకుంఠ ద్వార దర్శనం దృష్ట్యా తిరుమలలో కోవిడ్ మార్గదర్శకాలు మరింత కఠినంగా అమలు చేయాలని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు.

తిరుమల లోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం రాత్రి ఆయన కోవిడ్ మార్గదర్శకాల అమలు పై అదనపు ఈవో శ్రీ ధర్మారెడ్డి ఇతర ఆధికారులతో సమీక్షించారు.

జనవరి 13వ తేదీ వైకుంఠ ఏకాదశి,14వ తేదీ ద్వాదశి ద్వాదశి తో పాటు మిగిలిన 8 రోజులు భక్తులు, ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. జనసమూహం ఉండే ప్రాంతాలు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, క్యూ లైన్లు, శ్రీవారి ఆలయంలో శానిటైజర్లు అందుబాటులో ఉంచాలన్నారు. ప్రతి ఒక్క భక్తుడు, ఉద్యోగులు తప్పనిసరిగా మాస్క్ ధరించేలా చర్యలు తీసుకోవాలని చైర్మన్ ఆదేశించారు. ఇందుకోసం భక్తులకు అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు.

వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో క్యూ లైన్, శ్రీవారి ఆలయంలో భక్తులు భౌతిక దూరం తప్పనిసరిగా పాటించేలా చూడాలన్నారు. భక్తులు తోపులాటకు దిగకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకుని వెళ్ళేలా ఏర్పాట్లు చేయాలని ఛైర్మన్ అధికారులను ఆదేశించారు.
శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, అధికారులు, ఉద్యోగులకు సహకరించాలని ఛైర్మన్ శ్రీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది