IMPORTANT ARRANGEMENTS DURING SRIVARI SALAKATLA BRAHMOTSAVAMS HIGHLIGHTED _ శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల‌కు ఏర్పాట్లు పూర్తి

TIRUMALA, 06 OCTOBER 2021: As the annual brahmotsavams of Sri Venkateswara Swamy at Tirumala are scheduled from October 7 with Ankurarpanam on October 6, TTD Chairman Sri YV Subba Reddy along with EO Dr KS Jawahar Reddy highlighted the arrangements. 

The media briefing took place at Annamaiah Bhavan in Tirumala on Wednesday. Speaking on the occasion, the Chairman said, though TTD thought of organizing annual fete in a big manner, the threat of possible third wave of Covid 19 alarmed by Central and State governments forced them to conduct the mega religious festival in Ekantam this year also. However, TTD will live telecast all the events, vahana sevas for the sake of global devotees in SVBC. Excerpts:

October 6: Between 6pm – 7pm: Ankurarpanam

October 7: Between 5.10pm – 5.30pm: Dhwajarohanam in Meena Lagnam

Morning Vahana Sevas: Between 9am and 10am

Evening Vahana Sevas: Between 7pm and 8pm

October 11: Garuda Seva between 7pm and 8.30pm

No Swarna Ratham and Wooden Chariot due to Ekantam. Instead Sarva
Bhupala Vahana Seva takes place

October 15: Chakra Snanam in Aiyna Mahal due to Ekantam

All Vahana Seva in Kalyanotsava Mandapam for the sake of global devotees

All rituals during Brahmotsavams as per Agamas as usual.

Live telecast Brahmotsavam festivities in SVBC

SVBC clean feed of Brahmotsavam rituals in all other channels

PR Department of TTD to provide news and photos of the mega event to
media

Further briefing the media on the two-day visit of Honourable Chief Minister of Andhra Pradesh Sri YS Jagan Mohan Reddy on October 11 and 12, the Chairman said the Honourable CM will offer silk vastrams on behalf of state government on Garuda Seva day on October 11. Earlier, he will also inaugurate Paediatric Cardiac Hospital which is setup at BIRRD exclusively for children with heart ailments. “The Saptha Go Pradakshina Mandiram built at a cost of Rs.15crore by a Chennai based donor and the renovated Alipiri Footpath at Rs.25crore by Reliance Industries will also be opened by the Honourable CM”, he maintained.

On October 12, the Honourable CM will launch Hindi and Kannada SVBC channels. While the Kannada SVBC he will launch along with his Karnataka counterpart Sri Basavaraj Bommai at Tirumala. Later the new Boondi Complex constructed by India Cements on donation basis at Rs.12crore will also be opened on the occasion, he added.

The Chairman said, TTD will be providing free Srivari Brahmotsavam Darshan to devotees hailing from backward classes where TTD has built Srivari temples devotees across the state from October 7 to 14.

Later speaking to media, TTD EO said, in the place of Swarna Ratham on October 12 and Wooden Chariot on October 14, Sarvabhoopala Vahanam will be observed. As per the suggestion of Agama Advisors, the Chakrasnanam which will be observed on the last day of annual brahmotsavam on October 15 will be observed at Aina Mahal. He said two dosages of vaccination report or Covid negative test report are must for the devotees along with their darshan tickets while coming to Tirumala.

The Additional EO Sri AV Dharma Reddy briefed media on the department-wise arrangements during annual brahmotsavams. He also said programmes like Adiparvam, Venkatachala Mahatyam, Vahana Vaisistyam are planned during the annual fete which will be telecasted live on SVBC.

CVSO Sri Gopinath Jatti, CEO SVBC Sri Suresh Kumar, SE 2 Sri Jagadeeshwar Reddy, VGO Sri Bali Reddy were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల‌కు ఏర్పాట్లు పూర్తి

– అక్టోబ‌రు 11, 12వ తేదీల్లో ముఖ్య‌మంత్రితో ప‌లు ప్రారంభోత్స‌వాలు
 
– వెనుకబడిన పేద వర్గాల భక్తులకు శ్రీవారి బ్రహ్మోత్సవ దర్శనం

– ద‌ర్శ‌న టికెట్లు ఉన్న‌భ‌క్తులు మాత్ర‌మే తిరుమ‌ల‌కు రావాల‌ని విజ్ఞ‌ప్తి

– టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి

తిరుమల, 2021 అక్టోబరు 06: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అక్టోబ‌రు 7 నుండి 15వ తేదీ వ‌ర‌కు ఏకాంతంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు పూర్త‌య్యాయ‌ని టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో బుధ‌వారం సాయంత్రం మీడియా స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ మాట్లాడుతూ అక్టోబరు 7వ తేదీ గురువారం సాయంత్రం 5.10 నుండి 5.30 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయ‌న్నారు. శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో వాహనసేవలు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు నిర్వహిస్తామ‌ని, గరుడసేవ మాత్రం రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు జరుగుతుంద‌ని చెప్పారు. ఈసారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తుండడం వలన స్వర్ణరథం, రథోత్సవం ఉండవ‌ని, వీటికి బదులు సర్వభూపాల వాహనసేవ జరుగుతుంద‌ని తెలియ‌జేశారు. ఈ నెల 15వ తేదీన చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయ‌న్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తులు భక్తితో ఆసక్తిగా ఎదురు చూస్తారని, ఈ ఏడాది కూడా కోవిడ్‌-19 వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయించామ‌ని వివ‌రించారు.

స్వామివారికి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆగమోక్తంగా నిర్వహించే కార్యక్రమాలు యథాతథంగా జ‌రుగుతాయ‌న్నారు. భక్తులు ఈ వేడుకలు చూడటం కోసం శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తామ‌ని తెలిపారు. ఎస్వీబీసీ క్లీన్‌ఫీడ్‌ ద్వారా ఇతర ఛానళ్లలో కూడా బ్రహ్మోత్సవాల వాహన సేవలు ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టారు. టిటిడి ప్రజాసంబంధాల విభాగం ద్వారా మీడియాకు ఎప్పటికప్పుడు పత్రికా ప్రకటనలు, ఫొటోలు అందిస్తామ‌ని చెప్పారు. ఆగమపండితుల సలహాలు, సూచనల మేరకు ఈసారి స్వామివారి చక్రస్నానం ఆలయంలోని ఐన మహల్‌లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న‌ట్టు తెలిపారు.

ద‌ర్శ‌న టికెట్లు ఉన్న‌భ‌క్తులు మాత్ర‌మే తిరుమ‌ల‌కు రావాల‌ని విజ్ఞ‌ప్తి

కోవిడ్‌ వ్యాప్తి కట్టడిలో భాగంగా దర్శన టోకెన్లు ఉన్న భక్తులు మాత్రమే తిరుమలకు రావాలని ఛైర్మ‌న్ విజ్ఞప్తి చేశారు. దర్శనం టోకెన్లు కలిగిన భక్తులు వ్యాక్సినేషన్‌ పూర్తి అయిన సర్టిఫికెట్‌ గానీ, దర్శనానికి మూడు రోజుల ముందు ఆర్‌టిపిసిఆర్‌ పరీక్ష చేయించుకుని తీసుకున్న కోవిడ్‌ నెగెటివ్‌ సర్టిఫికెట్‌ గానీ తప్పనిసరిగా తీసుకురావాల‌ని కోరారు.

ముఖ్యమంత్రి గారి చేతులమీదుగా ప్రారంభోత్సవాలు

ఈ నెల 11వ తేదీ గరుడసేవ రోజున సాయంత్రం ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని, ఈ సందర్భంగా పలు ప్రారంభోత్సవాలు చేస్తారని ఛైర్మ‌న్ తెలిపారు.

అక్టోబరు 11న

– తిరుపతిలోని బర్డ్‌ ఆసుపత్రి పాత బ్లాక్‌లో తాత్కాలికంగా రూ.25 కోట్లతో వ్య‌యంతో నిర్మించిన చిన్నపిల్లల పీడియాట్రిక్‌ కార్డియాక్‌ ఆసుపత్రి ప్రారంభం.

– అలిపిరి పాదాల మండపం వద్ద చెన్నైకి చెందిన దాత రూ.15కోట్ల విరాళంతో నిర్మించిన గోమందిరం ప్రారంభం. ఇందులో గోప్రదక్షిణ, గోతులాభారం, గోవు ప్రాశస్త్యాన్ని భక్తులకు తెలియజేసేలా ఏర్పాట్లు చేప‌ట్టారు.

–   రూ.25 కోట్ల వ్య‌యంతో దాత పునఃనిర్మించిన అలిపిరి నుంచి తిరుమల నడకదారి పైకప్పు ప్రారంభం.
.
అక్టోబరు 12న

–   తిరుమలలో ఇండియా సిమెంట్స్‌ రూ.12 కోట్ల విరాళంతో నిర్మించిన నూతన బూందిపోటు ప్రారంభం.

–   ఎస్వీబీసీ కన్నడ, హిందీ ఛానళ్ల ప్రసారాలు ప్రారంభం. క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు.

వెనుకబడిన పేద వర్గాల భక్తులకు శ్రీవారి బ్రహ్మోత్సవ దర్శనం

రాష్ట్రంలోని 13 జిల్లాల నుండి రోజుకు సుమారు వెయ్యి మంది చొప్పున వెనుకబడిన పేద వర్గాల భక్తులకు అక్టోబరు 7 నుండి 14వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవ దర్శనం చేయించేందుకు ఏర్పాట్లు చేపట్టిన‌ట్టు ఛైర్మ‌న్ వెల్ల‌డించారు. వీరికి తిరుమల శ్రీవారి దర్శనంతోపాటు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనం చేయిస్తామ‌న్నారు.

సనాతన హిందూ ధర్మాన్ని వ్యాప్తి చేసేందుకు, మత మార్పిడులను అరికట్టేందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ ద్వారా సమరసత సేవా ఫౌండేషన్‌ సహకారంతో టిటిడి మొదటి విడతలో రూ.25 కోట్లతో 13 జిల్లాల్లో 502 ఆలయాలు నిర్మించామ‌న్నారు. ఈ ఆలయాలు నిర్మించిన వెనుకబడిన ప్రాంతాల నుండి పేదవర్గాల వారిని బ్రహ్మోత్సవాల సమయంలో ఆహ్వానించి శ్రీవారి దర్శనం చేయించడం జరుగుతుందన్నారు. ఒక్కో జిల్లా నుండి 10 బస్సులు ఏర్పాటుచేసి భక్తులను ఉచితంగా తిరుమలకు తీసుకొచ్చి ద‌ర్శ‌నం చేయించి తిరిగి వారి ప్రాంతాల‌కు తీసుకెళతామ‌ని చెప్పారు. తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువగా ఉండడంతో 20 బస్సులు ఏర్పాటు చేశామ‌న్నారు. దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు మార్గమధ్యంలో స్థానిక దాతల సహకారంతో ఆహార పానీయాలు అందించేందుకు ఏర్పాట్లు చేపట్టామ‌న్నారు.

పుట్టుక‌తో గుండె స‌మ‌స్య‌లున్న చిన్న‌పిల్ల‌ల‌కు ఉచితంగా ఆప‌రేష‌న్లు : టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

తిరుప‌తిలో ముఖ్య‌మంత్రివ‌ర్యుల చేతుల‌మీదుగా ప్రారంభించ‌నున్న ఎస్వీ పీడియాట్రిక్ కార్డియాక్ ఆసుప్ర‌తిలో పుట్టుక‌తో గుండె స‌మ‌స్య‌లున్న చిన్న‌పిల్ల‌ల‌కు ఉచితంగా ఆప‌రేష‌న్లు నిర్వ‌హిస్తామ‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి వెల్ల‌డించారు. రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఆదేశాల మేర‌కు 9 నెల‌ల పాటు కృషి చేసి ఈ ఆసుప్ర‌తిలో రూ.10 కోట్ల‌తో సివిల్ ప‌నులు పూర్తి చేశామ‌ని, రూ.15 కోట్ల‌తో అధునాత‌న వైద్య‌ప‌రిక‌రాలు ఏర్పాటు చేశామ‌ని వివ‌రించారు. అక్టోబ‌రు 12వ తేదీ నుండి ఈ ఆసుప‌త్రిలో ఓపి సేవ‌లు ప్రారంభ‌మ‌వుతాయ‌ని, ఒక నెల‌లో ఆప‌రేష‌న్లు చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తామ‌ని తెలిపారు. ఇక్క‌డ ప్ర‌సిద్ధి చెందిన డాక్ట‌ర్లు స్వ‌చ్ఛందంగా సేవ‌లు అందించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్టు చెప్పారు.

గోసంర‌క్ష‌ణ‌కు విశేషంగా కృషి చేస్తున్నామ‌ని, ఇందులో భాగంగానే గోమందిరం నిర్మాణం జ‌రిగింద‌ని ఈవో తెలిపారు. డిసెంబ‌రులో 15 పంచ‌గ‌వ్య ఆధారిత గృహావ‌స‌రాల ఉత్ప‌త్తుల‌ను ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకొస్తామ‌న్నారు. ఎసీబీసీ క‌న్న‌డ ఛాన‌ల్ ద్వారా దాస సంకీర్త‌న‌ల‌ను విస్తృతంగా ప్ర‌చారం చేస్తామ‌ని తెలిపారు. తెలుగులో శ్రీ అన్న‌మ‌య్య త‌ర‌హాలో, క‌న్న‌డంలో శ్రీ పురంద‌ర‌దాస పెద్ద సంఖ్య‌లో సంకీర్త‌న‌లు ర‌చించార‌ని, వాటికి ప్రాచ‌ర్యం క‌ల్పిస్తామ‌ని వివ‌రించారు. దాస న‌మ‌నం పేరుతో దాస సంకీర్త‌న‌ల‌ను సేక‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌న్నారు. ఎస్వీబీసీ హిందీ ఛాన‌ల్ ద్వారా ఉత్త‌ర భార‌త‌దేశంలో భ‌జ‌న సంప్ర‌దాయాన్ని ప్ర‌చారం చేస్తామ‌ని తెలిపారు.

బ్ర‌హ్మోత్స‌వాల‌కు విశేషంగా ఏర్పాట్లు  : టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

బ్ర‌హ్మోత్స‌వాల‌కు ఆయా విభాగాల ఆధ్వ‌ర్యంలో విశేషంగా ఏర్పాట్లు చేప‌ట్టామ‌ని టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. ఆ వివ‌రాలను తెలియ‌జేశారు.

శ్రీవారి ఆలయం

–   అక్టోబరు 15వ తారీఖున బ్రేక్‌ దర్శనం రద్దు.

–   రోజుకు 3.50 లక్షల లడ్డూలు నిల్వ ఉంచుకోవడం జరుగుతుంది.

–   రోజుకు 30 వేల కొబ్బరికాయలు ఏర్పాటు.

ఆరోగ్య విభాగం

–   కోవిడ్‌-19 మూడో దశ ముప్పు పొంచి ఉందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం జనసమ్మర్థం ఉన్న అన్ని ప్రాంతాల్లోను ట్రై ఓజోన్‌, వైరిసైడల్‌ పిచికారీ చేపట్టనున్నాం.

–   భక్తులు భౌతిక దూరం పాటించేలా, మాస్కులు ధరించేలా, శానిటైజర్‌ వినియోగించేలా సూచనలు.

నిఘా మరియు భద్రత

–   ఘాట్‌రోడ్లు ఉదయం 2 నుండి రాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచుతారు.

–   తిరుమలలో ముఖ్యమైన ప్రాంతాల్లో 1600కిపైగా సిసి కెమెరాలతో నిఘా.

–   పోలీసు, టిటిడి విజిలెన్స్‌ విభాగాల సమన్వయంతో భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది.

విద్యుత్‌ అలంకరణలు

–   తిరుమలలోని ముఖ్య కూడళ్లు, భవనాలు, ఉద్యానవనాలు, డివైడర్లు మొదలైన వాటికి విద్యుత్‌ అలంకరణలు చేపడతారు.

అన్నప్రసాద వితరణ

–   మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఉదయం 8 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు భక్తులకు అన్నప్రసాద వితరణ.

–       తిరుమ‌ల‌లో 6 జ‌న‌తా క్యాంటీన్లు ప్రారంభ‌మ‌య్యాయి. పెద్ద క్యాంటీన్లు ఒక వారంలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.

ఆర్‌టిసి

–   బ్రహ్మోత్సవాల రోజుల్లో 200 బస్సులు 800 ట్రిప్పులతో రోజుకు 20 వేల మంది భక్తులను తిరుమల, తిరుపతి మధ్య రవాణా చేసేందుకు ప్రణాళిక.

ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు

–   నాదనీరాజనం వేదికపై విష్ణుసహస్రనామ స్తోత్ర పారాయణం, టిటిడి పురాణ పండితులతో ప్రవచనాలు, అన్నమాచార్య సంకీర్తనలు, హరికథ, బ్రహ్మపురాణ పఠనం.

–   ఆస్థాన మండపంలో భజనలు, నృత్య కార్యక్రమాలు.

–   వసంత మండపంలో వేంకటాచల మహత్యం మరియు వాహనవిశేషాలపై పండితులతో ఉపన్యాసాలు.

శ్రీవారి సేవ

–   తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో భక్తులకు సేవలందించేందుకు 600 మంది శ్రీవారి సేవకులు.

మీడియా స‌మావేశంలో టిటిడి సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఎస్ఇ-2 శ్రీ జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, ఎస్వీబీసీ సీఈవో శ్రీ సురేష్‌కుమార్‌, విజివో శ్రీ బాలిరెడ్డి పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.