IMPORTANT BOARD RESOLUTIONS_ టిటిడి ధర్మకర్తల మండలి సమావేశంలో ముఖ్య నిర్ణయాలు

Tirumala, 27 Nov. 18: The TTD Trust Board under the Chairmanship of Sri P Sudhakar Yadav has taken some important resolutions during the board meeting held at Annamaiah Bhavan in Tirumala on Tuesday.

Some excerpts

* The board has decided to give incentives to Contract and Outsourcing employees in the following categories.

Category. Existing Incentive Amount

Skilled 11000 12000/12500/13000

Semi 9500 11500/12000/12500
Skilled.

Unskilled. 7500. 10000/10500/11000

* Approval of tenders for Rs.42.71 crores towards the beautification of Avilala tank

* Sanction of Rs.21.75 crores towards the construction of New Boondi Complex

* Sanction of Rs.2.50 crores towards the development Avanakshamma temple in Narayanavanam

* Sanction of Rs.3.77 crores towards brass grlling of Swamy Pushkarani

* Sanction of Rs.4.19 crores towards the construction of Sri Venkateswara Swamy temple at Bhuvaneswar in Orissa near TTD Kalyana Mandapam.

* Sanction of Rs.28 lakhs towards the construction of Arch for Tataiahgunta Rangamma temple at TUDA bypass road.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

టిటిడి ధర్మకర్తల మండలి సమావేశంలో ముఖ్య నిర్ణయాలు

నవంబరు 27, తిరుమల 2018: టిటిడి ధర్మకర్తల మండలి సమావేశం మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగింది. ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్‌యాదవ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలు ఇలా ఉన్నాయి.

– టిటిడి కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ప్రోత్సాహకాలు(ఇన్‌సెంటివ్స్‌) అందించాలని నిర్ణయం.

అన్‌స్కిల్డ్‌ ఉద్యోగులకు 7500/- నుండి గ్రేడ్ల వారీగా 10,000/-, 10,500/-, 11,000/- .

సెమీస్కిల్డ్‌ ఉద్యోగులకు 9,500/- నుండి గ్రేడ్ల వారీగా 11,000/-, 11,500/-, 12,000/-.

స్కిల్డ్‌ ఉద్యోగులకు 11,000/- నుండి గ్రేడ్ల వారీగా 12,000/-, 12,500/-, 13,000/- పెంచడం జరిగింది.

– చిత్తూరు జిల్లా నారాయణవనంలోని శ్రీ అవనాక్షమ్మవారి ఆలయంలో రూ.2.50 కోట్లతో ప్రాకారం, గోపురం, పోటు ఇతర నిర్మాణాలు చేపట్టేందుకు ఆమోదం.

– తిరుమల బైపాస్‌ రోడ్డులోని తుడ జంక్షన్‌ రోడ్డు వద్ద శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి గుర్తింపు కోసం రూ.28 లక్షల వ్యయంతో ఆర్చి నిర్మాణానికి ఆమోదం.

– రూ.3.77 కోట్లతో తిరుమలలోని శ్రీవారి పుష్కరిణి చుట్టూ ఇత్తడి గ్రిల్స్‌ ఏర్పాటుకు, ఇతర సుందరీకరణ పనులకు టెండర్లు ఆమోదం.

– తిరుమలలో బూందీ పోటు పక్కన ఆధునిక సదుపాయాలతో నూతన బూందీ కాంప్లెక్స్‌ నిర్మించేందుకు రూ.21.75 కోట్లు మంజూరు.

– అవిలాల చెరువు సుందరీకరణలో భాగంగా మొదటి దశలో మిగిలిన పనులను పూర్తి చేసేందుకు రూ.42.71 కోట్లతో టెండర్లు ఖరారు.

– ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్‌లో గల టిటిడి కల్యాణమండపం ప్రాంగణంలో శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని రూ.4.19 కోట్లతో నిర్మించేందుకు టెండర్లు ఖరారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ డా|| ఎం.పద్మ, ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీమతి సుధా నారాయణమూర్తి, శ్రీమతి సప్న, శ్రీబోండా ఉమామహేశ్వరరావు, శ్రీరుద్రరాజు పద్మరాజు, శ్రీ చల్లా రామచంద్రారెడ్డి, శ్రీబికె.పార్థసారధి, శ్రీజిఎస్‌ఎస్‌.శివాజి, శ్రీ డొక్కా జగన్నాథం, శ్రీ మేడా రామకృష్ణారెడ్డి, శ్రీరమేష్‌బాబు, ప్రత్యేక ఆహ్వానితులు శ్రీరాఘవేంద్రరావు, శ్రీ ఎన్‌.శ్రీకృష్ణ, శ్రీ అశోక్‌రెడ్డి, తిరుమల జెఈవో శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, సివిఎస్‌వో శ్రీగోపినాథ్‌జెట్టి పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.