KOIL ALWAR TIRUMANJANAM PERFORMED_ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Tiruchanoor, 27 Nov. 18: As the annual Karthika Brahmotsavams of Sri Padmavathi Ammavaru are set to commence from December 4, Klik Laat Tirumanjanam was performed in Tiruchanoor temple on Tuesday.

The traditional temple cleansing fete commenced at 6am and lasted for about three hours. The entire temple walls, roofs, pillars were smeared with a separate sacred mixture called Parimalam.

Later the devotees are allowed for darshanam from 9.30am onwards.

Temple DyEO Smt Jhansi Rani and other temple staffs were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుపతి, 2018 నవంబరు 27: సిరుల తల్లి తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని అమ్మవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి ఉదయం 6.00 నుండి 9.00 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఉపకార్యనిర్వహణాధికారి శ్రీమతి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం, ఆలయ ఆర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

వాహనసేవల వివరాలు :

తేదీ ఉదయం రాత్రి

4-12-2018(మంగళవారం) ధ్వజారోహణం(వృశ్చిక లగ్నం) చిన్నశేషవాహనం

5-12-2018(బుధవారం) పెద్దశేషవాహనం హంసవాహనం

6-12-2018(గురువారం) ముత్యపుపందిరి వాహనం సింహవాహనం

7-12-2018(శుక్రవారం) కల్పవృక్ష వాహనం హనుమంతవాహనం

8-12-2018(శనివారం) పల్లకీ ఉత్సవం గజవాహనం

9-12-2018(ఆదివారం) సర్వభూపాలవాహనం స్వర్ణరథం, గరుడవాహనం

10-12-2018(సోమవారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం

11-12-2018(మంగళవారం) రథోత్సవం అశ్వ వాహనం

12-12-2018(బుధవారం) పంచమీతీర్థం ధ్వజావరోహణం.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.