IMPORTANT DAYS IN KRT _ నవంబరులో శ్రీ కోదండరామాలయంలో విశేష ఉత్సవాలు
Tirupati, 29 Oct. 19: The following are important days in the month of November in Sri Kodanda Rama Swamy temple in Tirupati.
The abhishekam to mulavarulu will be observed on November 2, 9, 16, 23 and 30.
On November 12, in connection with Pournami Astottara Satakalasabhishekam will be observed while on November 17, Sri Sita Rama Kalyanam will be performed.
On the day of Amavasya on November 26, Hanumantha vahana seva will be observed.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI
నవంబరులో శ్రీ కోదండరామాలయంలో విశేష ఉత్సవాలు
తిరుపతి, 2019 అక్టోబరు 29: తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో నవంబరు నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
– నవంబరు 2, 9, 16, 23, 30వ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6.00 గంటలకు శ్రీసీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం నిర్వహిస్తారు. భక్తులు రూ.20/- చెల్లించి మూలవర్ల అభిషేకంలో పాల్గొనవచ్చు. సాయంత్రం 6.00 గంటలకు స్వామి, అమ్మవారిని తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు, అనంతరం రాత్రి 7.00 గంటలకు ఆలయంలో ఊంజల్‌సేవ నిర్వహిస్తారు. రూ.116/- టికెట్ కొనుగోలు చేసి ఊంజల్‌సేవలో పాల్గొనవచ్చు.
– నవంబరు 12న పౌర్ణమి సందర్భంగా ఉదయం 9 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహిస్తారు. రూ.50/- చెల్లించి భక్తులు ఈ సేవలో పాల్గొనవచ్చు. సాయంత్రం 5.30 గంటలకు ఆలయ నాలుగు మాడ వీధుల నుంచి శ్రీరామచంద్ర పుష్కరిణి వరకు తిరుచ్చి ఉత్సవం నిర్వహిస్తారు. సాయంత్రం 6.30 గంటలకు ఆస్థానం చేపడతారు.
– నవంబరు 17న పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు స్వామి, అమ్మవారిని తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల గుండా శ్రీ రామచంద్ర పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళతారు. సాయంత్రం 6.30 గంటలకు ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.
– నవంబరు 26న అమావాస్య సందర్భంగా ఉదయం 6.30 గంటలకు సహస్ర కలశాభిషేకం జరుగనుంది. రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) పాల్గొనవచ్చు. రాత్రి 7.00 గంటలకు హనుమంత వాహనసేవ జరుగనుంది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.