IMPORTANT DAYS IN OCTOBER IN SRI GT_ అక్టోబరులో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు
Tirupati, 27 Sep. 18: Sri Govindaraja Swamy temple is one of the most ancient and important sub shrines under the umbrella of TTD located in Tirupati.
The important festival days in the month of October in the famous shrine of Sri Govindaraja Swamy temple:
October 5, 12, 19, 26: Procession of Sri Andal Ammavaru on Fridays in the mada streets between 4.30pm and 5.30pm
October 8 : Procession of Lord with His two Consorts in connection with the advent of Uttara star
October 18 : Procession of Lord on Aswa Vahanam in connection with Vijaya Dasami Paruveta, Vedanta Desikar Sattumora
October 20 : Sri Peiyalwar Varsha Tirunakshatram
October 24 : Pournami Garuda Seva
October 28 : Procession of Sri Parthasaradhi and consorts in connection with the advent of Rohini Nakshatram
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
అక్టోబరులో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు
తిరుపతి, 2018 సెప్టెంబరు 27: టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో అక్టోబరులో జరుగనున్న ఉత్సవాల వివరాలిలా ఉన్నాయి.
– అక్టోబరు 5, 12, 19, 26వ తేదీల్లో శుక్రవారం శ్రీ ఆండాళ్ అమ్మవారు సాయంత్రం 4.30 నుండి 5.30 గంటల వరకు ఊంజల్ సేవ అనంతరం ఆలయ మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహిస్తారు.
– అక్టోబరు 8న ఉత్తర నక్షత్రం సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారు సాయంత్రం 4.30 నుండి 5.30 గంటల వరకు ఊంజల్ సేవ అనంతరం ఆలయ మాడ వీధుల్లో భక్తులను కటాక్షిస్తారు.
– అక్టోబరు 18న విజయదశమి పార్వేట సందర్భంగా మధ్యాహ్నం 3 గంటలకు అశ్వ వాహనంపై శ్రీగోవిందరాజస్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.
అదేరోజు, వేదాంతదేశికర్ శాత్తుమొర సందర్భంగా శ్రీవేదాంతదేశికర్‌తో కలిసి శ్రీగోవిందరాజ స్వామివారు రాత్రి 8 గంటలకు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహిస్తారు.
– అక్టోబరు 20న ఆళ్వార్ సన్నిధిలో శ్రీ పేయాళ్వార్ వర్ష తిరునక్షత్రం జరుగనుంది.
– అక్టోబరు 24న పౌర్ణమి గరుడసేవ నిర్వహిస్తారు.
– అక్టోబరు 28న రోహిణి నక్షత్రం సందర్భంగా రుక్మిణి, సత్యభామ సమేత శ్రీపార్థసారధిస్వామివారు సాయంత్రం 4.30 నుండి 5.30 గంటల వరకు ఊంజల్ సేవ అనంతరం ఆలయ మాడ వీధుల్లో భక్తులకు అభయమిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.