TTD VIGILANCE VERIFIES VIP BREAK DARSHAN TICKETS_ విఐపి బ్రేక్‌ దర్శనం టికెట్ల తనిఖీలు

Tirumala, 27 Sep. 18: Under the instructions of Tirumala JEO Sri KS Sreenivasa Raju, a team of 100 TTD vigilance sleuths lead by CVSO In-charge, Sri Venkata Siva Kumar Reddy, verified the Aadhaar IDs and VIP break darshan tickets, in Vaikuntham Queue Complex on Thursday.

Later speaking to media persons, JEO said, in the recent times, some middlemen misused the online lucky dip system of arjitha seva tickets which came to the fore. To curb such miscreants, vigilance verification has been instigated and all the VIP break darshan tickets have also been verified today. The pilgrims also co-operated with TTD during the verification process.

Adding further he said, the online dip system introduced by TTD is a very good, transparent and perfect scheme. But some touts misused the system encashing upon the weakness of some of the pilgrims who wish to have darshan of Lord. I sincerely appeal to all the pilgrims not fall prey to such miscreants.

The JEO said, following the Peratasi month, which is auspicious to Tamil folk, TTD has dispensed with break darshan on Fridays, Saturdays and Sundays for the next four weeks. Only protocol VIPs will be issued break darshan tickets. Even the Divya Darshan tokens are also will not be issued for the next four Saturdays while the Rs.300 tickets were issued in very limited numbers.

Tirumala has been currently witnessing unprecedented crowd and it is taking nearly 12-14 hours in queue lines itself for pilgrims as the lines have stretched outside following Peratasi month. All the departments are working round the clock and Annaprasadam, milk and water are being distributed to pilgrims with volunteers at regular intervals”, he added.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

విఐపి బ్రేక్‌ దర్శనం టికెట్ల తనిఖీలు

తిరుమల, 2018 సెప్టెంబరు 27: టిటిడి తిరుమల జెఈవో శ్రీ కెఎస్‌.శ్రీనివాసరాజు ఆదేశాల మేరకు ఇన్‌చార్జి సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి నేతృత్వంలో సుమారు వంద మంది విజిలెన్స్‌ సిబ్బంది గురువారం ఉదయం తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ వద్ద విఐపి బ్రేక్‌ దర్శనం టికెట్లను తనిఖీలు చేపట్టారు. నకిలీ గుర్తింపు కార్డులతో కొందరు యాత్రికులు ఆర్జిత సేవలను పొందినట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో శ్రీ కెఎస్‌.శ్రీనివాసరాజు మీడియాతో మాట్లాడుతూ విఐపి బ్రేక్‌ దర్శనం టికెట్లు జారీ చేసిన యాత్రికుల గుర్తింపు కార్డులను పరిశీలించామని, అందరూ చక్కగా సహకరించారని తెలిపారు. ఇటీవల నకిలీ గుర్తింపు కార్డులతో కొంతమంది అక్రమంగా ఆన్‌లైన్‌లో ఆర్జిత సేవా టికెట్లు పొందినట్లు విజిలెన్స్‌ అధికారుల తనిఖీలలో వెల్లడైందన్నారు. ఈ క్రమంలో అక్రమాలను అరికట్టేందుకు తనిఖీలు చేపట్టామన్నారు. దళారులకు అవకాశం కల్పించకుండా యాత్రికులు సక్రమమార్గంలో టికెట్లు పొందాలని కోరారు.

పెరటాసి మాసంలో యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని శనివారాలలో దివ్యదర్శనం టోకెన్లను జారీ చేయడం లేదని జెఈవో తెలిపారు. రూ.300/- ప్రత్యేకప్రవేశ దర్శనం టికెట్లను శని, ఆదివారాలలో పరిమితంగా జారీ చేస్తున్నట్లు తెలిపారు. రద్దీ నేపథ్యంలో శుక్రవారంతోపాటు శని, ఆదివారాలలోనూ ప్రోటోకాల్‌ ప్రముఖులకు మాత్రమే బ్రేక్‌ దర్శనం టికెట్లు పరిమితం చేసినట్లు వెల్లడించారు. భక్తుల కోసం లేపాక్షి సర్కిల్‌ నుండి ఆస్థానమండపం వరకు, ముళ్లగుంటలోనూ క్యూలైన్లు ఏర్పాటు చేశామన్నారు. భక్తులు 12 గంటల నుండి 14 గంటల వరకు క్యూలైన్లలో వేచియుండాల్సి వస్తోందని, వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు అందిస్తున్నామని వివరించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.