“IN INDIA EVERY DAY IS A WOMEN’S DAY”-SPEAKERS _ హైంద‌వ సంస్కృతిలో మ‌హిళ‌కు పూజ‌నీయ స్థానం: శ్రీ ప‌ద్మావ‌తి వ‌ర్సిటీ ఉప‌కుల‌ప‌తి ఆచార్య దువ్వూరు జ‌మున‌

Tirupati, 8 Mar. 20: For foreign countries, March 8 alone may be observed as Women’s Day but in India every day is a women’s day since we begin our day chanting “Sri Matre Namaha”, said Smt YV Swarnalatha Reddy, the spouse of TTD Chairman Sri YV Subba Reddy.

International Women’s Day was observed with fervour in TTD by women employees in a grand manner on Sunday at Annamacharya Kalamandiram in Tirupati. Smt Swarnalatha who graced the occasion, in her keynote address stated that the women in India enjoyed equal rights in Vedic period till a series of foreign invasions, which lead to patriarchal approach in later years.  

However, after struggle we are again on the path of good olden days and marching ahead in all fields on par with men today. She also exemplified how Gargi, Mytreyi, Lopamudra, Aditi and other women learnt Vedas in those days.

Later in her address Dr D Jamuna Rani, the vice-chancellor of Sri Padmavathi Mahila Viswa Vidyalayam in her address stated that it is only India where woman is revered as Goddess. However there is need to fight for women empowerment today in view of increased atrocities against women. She also said, the UNO slogan on International Women’s Day 2020 is Gender Equality and it’s time to achieve the same.

Another speaker Dr Ramalakshmi, a veteran Gynaecologist said, even today the foeticide are taking place, as the parents are not willing to give birth to girl child. Today we have only 935 girls against 1000 boys, which signifies the atrocities against women. This need to be addressed first to achieve equality”, she added.

Later the felicitation to the women employees who are going to retire in TTD this year, cultural programs etc. allured the audience.

The event was organized under the aegis of welfare department of TTD. Spl Gr DyEOs Smt Parvati, Smt Varalakshmi, DyEOs Smt Kasturibai, Smt Lakshminarasamma, Smt Shanti, Smt Nagaratna, SPWDPG Principal Smt Mahadevamma, Telugu Department Head Dr Krishnaveni, Dr Kusumakumari, APRO P Neelima, Superintendent Smt Srivani, Employees Bank Director Smt Hemalatha and others were also present.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

హైంద‌వ సంస్కృతిలో మ‌హిళ‌కు పూజ‌నీయ స్థానం :  శ్రీ ప‌ద్మావ‌తి వ‌ర్సిటీ ఉప‌కుల‌ప‌తి ఆచార్య దువ్వూరు జ‌మున‌
 
విశేష సేవ‌లందించిన ఏడుగురు మ‌హిళా ఉద్యోగుల‌కు శ్రీ ప‌ద్మావ‌తి అవార్డులు
 
తిరుపతి, 2020 మార్చి 08: హైంద‌వ సంస్కృతిలో మ‌హిళ‌కు గౌర‌వ‌ప్ర‌ద‌మైన‌ స్థానం ఉంద‌ని, స్త్రీని దేవ‌త‌గా పూజించ‌డం ఇక్క‌డ మాత్ర‌మే ఉంద‌ని తిరుప‌తిలోని శ్రీ ప‌ద్మావ‌తి వ‌ర్సిటీ ఉప‌కుల‌ప‌తి ఆచార్య దువ్వూరు జ‌మున తెలిపారు. టిటిడి ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్న‌మాచార్య క‌ళామందిరంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ప్ర‌ధాన‌వ‌క్త‌గా విచ్చేసిన ఆచార్య జ‌మున ప్రసంగిస్తూ భార‌తీయ నాగ‌రిక‌త మొద‌లైన‌ప్ప‌టి నుండి మ‌హిళ‌ల‌కే పెద్ద‌పీట వేశార‌ని, కుటుంబాన్ని ముందుండి న‌డ‌ప‌గ‌ల శ‌క్తి మాతృమూర్తి సొంత‌మని పేర్కొన్నారు. సింధూ నాగ‌రిక‌త, వేద‌కాలం నాటి ప‌రిస్థితులు ఈ విష‌యాన్ని రుజువు చేస్తున్నాయ‌ని వివ‌రించారు. ఆ త‌రువాత పితృస్వామ్య వ్య‌వ‌స్థ‌లో మ‌హిళ‌ల‌కు ప్రాధాన్యం త‌గ్గింద‌న్నారు. ప్ర‌స్తుతం స‌మాజం ముందుకు న‌డ‌వ‌డానికి లింగ స‌మానత్వం చాలా ముఖ్య‌మ‌ని, ఈ సంవ‌త్స‌రం మ‌హిళా దినోత్స‌వ ముఖ్య ఉద్దేశం కూడా ఇదేన‌ని తెలియ‌జేశారు. కుటుంబాల్లో బాలిక‌ల‌ను ధైర్యసాహ‌సాల‌తో పెంచాల‌ని, ప్ర‌తికూల ప‌రిస్థితుల‌ను చాక‌చ‌క్యంగా ఎదుర్కొనేలా తీర్చిదిద్దాల‌ని త‌ల్లిదండ్రుల‌కు సూచించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన దిశ చ‌ట్టాన్ని వినియోగించుకోవాల‌న్నారు. టిటిడిలో మ‌హిళా అధికారులు, ఉద్యోగులు అంకిత‌భావంతో ప‌నిచేసి సంస్థ ఉన్న‌తికి తోడ్ప‌డుతున్నార‌ని కొనియాడారు.

టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి స‌తీమ‌ణి శ్రీ‌మ‌తి స్వ‌ర్ణ‌ల‌త మాట్లాడుతూ మ‌న సంస్కృతిలో మాతృమూర్తికే ప్ర‌థ‌మ స్థాన‌మ‌ని, దేవ‌త‌ల్లో శ్రీ స‌ర‌స్వ‌తి, శ్రీ ల‌క్ష్మీదేవి, శ్రీ ఆదిప‌రాశ‌క్తి, వేద కాలంలో మైత్రేయి, గార్గేయి, పురాణాల్లో సీత లాంటి మ‌హిళామూర్తులు ఉన్నార‌ని తెలియ‌జేశారు. మ‌హిళ‌ల అభ్యుద‌యం కోసం అంబేద్క‌ర్ లాంటి మ‌హానుభావులు ఎంత‌గానో కృషి చేశార‌ని తెలిపారు.

చిత్తూరుకు చెందిన గైన‌కాల‌జిస్టు డాక్ట‌ర్ ఎం.రామల‌క్ష్మి ఉప‌న్య‌సిస్తూ త‌న త‌ల్లి కుప్పం రెడ్డెమ్మ స్ఫూర్తితో సామాజిక సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న‌ట్టు తెలిపారు. మ‌హిళ‌లు ఆరోగ్య‌వంతులుగా ఉండాల‌ని, త‌ద్వారా కుటుంబం, దేశం ఆరోగ్య‌క‌రంగా ఉంటాయ‌ని చెప్పారు. విస్తీర్ణంలో 6వ స్థానం, జ‌నాభాలో 2వ స్థానంలో ఉన్న మ‌న దేశం అభివృద్ధిలో మాత్రం 158వ స్థానంలో ఉంద‌న్నారు. మ‌హిళ‌లు సామాజికంగా, ఆర్థికంగా ఎద‌గాల‌ని, మ‌హిళ‌ల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్య‌మ‌వుతుంద‌ని వివ‌రించారు.

అతిథులకు సన్మానం :

ఈ సందర్భంగా అతిథులుగా విచ్చేసిన శ్రీ ప‌ద్మావ‌తి వ‌ర్సిటీ ఉప‌కుల‌ప‌తి ఆచార్య దువ్వూరు జ‌మున‌, టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి స‌తీమ‌ణి శ్రీ‌మ‌తి స్వ‌ర్ణ‌ల‌త, చిత్తూరుకు చెందిన గైన‌కాల‌జిస్టు డాక్ట‌ర్ ఎం.రామల‌క్ష్మిని జ్ఞాపిక, శాలువతో సన్మానించి శ్రీవారి ప్రసాదాలు అందజేశారు.

అదేవిధంగా, టిటిడిలో విశేష సేవ‌లందించి ఉద్యోగ విర‌మ‌ణ పొందిన న‌లుగురిని స‌న్మానించారు. వీరిలో డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి రెడ్డెమ్మ‌, ఏఈవో శ్రీ‌మ‌తి నీర‌జ‌, సీనియ‌ర్ అసిస్టెంట్ శ్రీ బాలామ‌ణి, ఉపాధ్యాయురాలు శ్రీ అనంత‌మ్మ ఉన్నారు.

7గురు మ‌హిళా ఉద్యోగుల‌కు శ్రీ ప‌ద్మావ‌తి అవార్డులు

 విధి నిర్వ‌హ‌ణ‌లో ఉత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన ఏడుగురు మ‌హిళా ఉద్యోగుల‌కు మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి పేరిట అవార్డులు ప్ర‌దానం చేశారు. వీరిలో ఎస్‌జిఎస్ హైస్కూల్ స్కూల్ అసిస్టెంట్ శ్రీమ‌తి బి.విజ‌య‌కుమారి, ర‌వాణా విభాగంలో ఫిట్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎన్‌.ప‌ద్మావ‌త‌మ్మ‌, అశ్విని ఆసుప‌త్రి స్టాఫ్ న‌ర్సు శ్రీ‌మ‌తి వి.రాణి, ఉద్యాన‌వ‌న విభాగం ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీ‌మ‌తి కె.నాగ‌భూష‌ణ‌మ్మ‌, ఆరోగ్య విభాగంలోని ఎఫ్ఎస్‌పి శ్రీ‌మ‌తి ఎస్ఆర్‌.జ‌య‌మ్మ‌, ఎంపిడ‌బ్ల్యు శ్రీ‌మ‌తి సి.శంక‌ర‌మ్మ‌, శ్రీ‌మ‌తి కె.ల‌క్ష్మీదేవి ఉన్నారు. వీరికి 5 గ్రాముల వెండి డాల‌ర్‌తోపాటు శాలువ‌, జ్ఞాపిక‌, శ్రీ‌వారి ప్ర‌సాదం అందించారు.

ఆ తరువాత 2020 మార్చి నుండి 2021 ఫిబ్ర‌వ‌రి వరకు పదవీ విరమణ పొందనున్న 66 మంది మహిళా ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. ఈ సంద‌ర్భంగా ఎస్వీ సంగీత‌, నృత్య క‌ళాశాల అధ్యాప‌కురాలు శ్రీ‌మ‌తి ఉషారాణి, విద్యార్థినులు ప్ర‌ద‌ర్శించిన నృత్యం, వేష‌ధార‌ణ‌ ప్ర‌ద‌ర్శ‌న‌లు, శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ, పిజి క‌ళాశాల అధ్యాప‌కులు ప్ర‌ద‌ర్శించిన “క‌ళాశాల‌లో మేము – మా భ‌క్తి” ల‌ఘునాటిక త‌దిత‌ర సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు ఆక‌ట్టుకున్నాయి. ఇందులో తిరుప‌తిలోని శ్రీ‌వారి సేవ విభాగం సూప‌రింటెండెంట్ శ్రీ‌మ‌తి విజ‌య‌ల‌క్ష్మి శ‌బ‌రి వేష‌ధార‌ణలో మెప్పించారు.

గాత్ర సంగీతం, వ్యాస‌ర‌చ‌న విజేత‌ల‌కు బ‌హుమ‌తులు

అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా గాత్ర సంగీతం, వ్యాస‌ర‌చ‌న విజేత‌ల‌కు బ‌హుమ‌తులు ప్ర‌దానం చేశారు. గాత్ర సంగీత పోటీల్లో ఎపిఆర్వో కుమారి పి.నీలిమ ప్ర‌థ‌మ‌, ఆఫీస్ స‌బార్డినేట్ శ్రీ‌మ‌తి బి.అమృత‌వ‌ళ్లి ద్వితీయ‌, శ్రీ‌మ‌తి శైల‌జ తృతీయ బ‌హుమ‌తులు సాధించారు. వ్యాస‌ర‌చ‌న పోటీల్లో ఎపిఆర్వో కుమారి పి.నీలిమ ప్ర‌థ‌మ‌, సీనియ‌ర్ అసిస్టెంట్లు శ్రీ‌మ‌తి కె.సౌజ‌న్య ద్వితీయ‌, శ్రీ‌మ‌తి కె.కిర‌ణ్మ‌యి తృతీయ బ‌హుమ‌తులు కైవ‌సం చేసుకున్నారు.

టిటిడి సంక్షేమ విభాగం డెప్యూటీ ఈవో శ్రీమతి ఆర్‌.స్నేహ‌ల‌త వందన సమర్పణ చేశారు. టిటిడి సహాయ ప్రజాసంబంధాల అధికారి కుమారి పి.నీలిమ, ఎస్‌పిడబ్ల్యు డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు డా|| వి.కృష్ణవేణి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.
 
ఈ కార్యక్రమంలో టిటిడి ప్ర‌త్యేక‌శ్రేణి డెప్యూటీ ఈవోలు శ్రీ‌మ‌తి వ‌ర‌ల‌క్ష్మీ, శ్రీ‌మ‌తి పార్వ‌తి, డెప్యూటీ ఈవోలు శ్రీ‌మ‌తి క‌స్తూరి, శ్రీ‌మ‌తి నాగ‌ర‌త్న, శ్రీ‌మ‌తి శాంతి, శ్రీ‌మ‌తి ల‌క్ష్మీన‌ర‌స‌మ్మ‌, శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ, పిజి క‌ళాశాల ప్రిన్సిపాల్ డా. మ‌హ‌దేవ‌మ్మ అశ్విని ఆసుప‌త్రికి చెందిన డాక్ట‌ర్ కుసుమ‌కుమారి ఇతర మహిళా ఆధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.