Inauguration of Laddu Counter for TTD Employees in Sri Kodanda Rama Swamy Temple, Tirupati  _ శ్రీ కోదండరామాలయంలో లడ్డూ  కౌంటర్‌ను ప్రారంభించిన తితిదే ఈఓ

Sri LV.Subramanyam, Executive Officer, TTDs has today inaugurated Laddu Counter for the benefit of the TTD Employees and Pensioners to have laddus on Laddu Card in TTD Sri Kodanda Rama Swamy Temple, Tirupati on Friday.
 
Sri P.Venkatarami Reddy, Joint Executive Officer, TTDs, DyEO’s Sri Chandrasekhar Pillai, Sri Bhaskar Reddy, Supdt Engineer Sri Sudhakar Rao, TTD Pensioners and Employees were present on the occassion.
శ్రీ కోదండరామాలయంలో లడ్డూ  కౌంటర్‌ను ప్రారంభించిన తితిదే ఈఓ

తిరుపతి, జనవరి 04, 2013: తితిదే ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల కోసం తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో శుక్రవారం తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం, తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డితో కలిసి లడ్డూ కౌంటర్‌ను ప్రారంభించారు.
 
ఈ సందర్భంగా తిరుపతి జెఇఓ శ్రీ పి.వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు శ్రీ కోదండరాముని దర్శించుకుని పవిత్రంగా స్వామివారి ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఉద్యోగులు మరింత కృషి చేసి భక్తులకు మెరుగైన సేవలందించాలన్నారు. ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు ఈ కౌంటర్‌ తెరిచి ఉంటుందన్నారు.
 
ఈ కార్యక్రమంలో ప్రత్యేక శ్రేణి ఉపకార్యనిర్వహణాధికారి(సంక్షేమం) శ్రీ భాస్కర్‌రెడ్డి, స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ చంథ్రేఖరపిళ్లై, ఎస్‌ఇ-1 శ్రీ సుధాకరరావు, విజిఓ శ్రీ హనుమంతు, ఇతర ఉన్నతాధికారులు, ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.