Inauguration of Renovated Blood Bank _ రక్తనిధి కేంద్రం ప్రారంభం
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
రక్తనిధి కేంద్రం ప్రారంభం
తిరుపతి, ఆగష్టు -13, 2009: 63వ సంవత్సర స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురసర్కరించి తి.తి.దేవస్థానము సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీమాన్ ఎన్.యువరాజ్ గారు కేంద్రీయ వైద్యశాలలో పునర్నిర్మాణము గావించబడిన రక్తనిధి కేంద్రమును ప్రారంభించారు. ఈసందర్భముగా రక్తధానము చేసిన రక్తదాతలనందరిని అభినందించారు. వైద్యశాలలోని అన్నీ శాఖలను సందర్శించి అన్ని విషయములపై చర్చించి తగిన సూచనలనిచ్చారు.
వైద్యశాఖ ముఖ్యవైద్యాధికారిణి శ్రీ డా. పి. శారద, సీనియర్ మెడికల్ ఆఫీసరు డా. ప్రభాకర్, సెంట్రల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డా. కుమారస్వామితో స్వైన్‌ప్లూ గురించి చర్చించారు. ఈవ్యాధికి సంబంధించిన లక్షణాలు, మెడికల్ సిబ్బంది చేయవలసిన అత్యవసర ఏర్పాట్లను గురించి ప్రస్తావించారు. ఏర్పాట్లను వేగవంతము చేయాలని సూచించారు. ఈవిషయముపై తితిదే వైద్యశాఖ ముందు జాగ్రత్త చర్యలను వేగవంతము చేయుచున్నారని ముఖ్యాధికారిణి జెఇఓ గారికి తెలియజేస్తారు.
అనంతరం ఆయన తితిదే ప్రధాన సంపాదకుల వారి కార్యాలయం, తితిదే ముద్రణాలయం, పుస్తక విక్రయశాలను సందర్శించారు. ఈసందర్భంగా సప్తగిరి మాసపత్రిక పంపిణీ విధానం, పుస్తకాల మార్కెటింగ్ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ముద్రణాలయంలో బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పోస్టర్లను, బుక్‌లెట్లను పరిశీలించారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.