SRIVANI DARSHAN COUNTERS INAUGURATED IN TIRUPATI _ ఇక తిరుపతిలోనే శ్రీవాణి దర్శనం టికెట్లు

JEO INAUGURATES COUNTERS AT MADHAVAM REST HOUSE

Tirupati, 30 November 2022: Hereafter TTD will issue Srivani Darshan tickets at Tirupati, said TTD JEO Sri Veerabrahmam on Wednesday after inaugurating the Srivani ticket counters at Madhavam rest house.

After performing special pujas the JEO issued the first Srivani ticket at Tirupati to Sri N Lakshmi Harish and Smt G Roop Sindhu couple of Guntur.

Speaking to the media later TTD JEO said till date those who donated ₹10,000 to Srivani trust could get one VIP break ticket of ₹500 at Tirumala only.

Donors had to visit Tirumala one day ahead and submit papers for ticket. TTD management had noticed the hardships of donors and hence commenced issuance of Srivani offline tickets at Tirupati and also the allotment of accommodation on availability in Madhavam Rest House.

He said the new system will be helpful to devotees as they could stay at Madhavam which is close to bus station and railway station and leave for Tirumala early morning directly for Darshan.

He said the Srivani trust funds are being used for the rejuvenation of dilapidated ancient temples, build new temples and bhajan mandirs.

In the first phase, 502 SV temples have been built under the trust and the construction of another 1500 temples are already sanctioned.

He appealed to devotees to utilise the Srivani trust counters at Madhavam in Tirupati and also complimented the Union Bank which had come forward to manage the counters.

TTD Chief Engineer Sri Nageswara Rao, Union  Bank  Regional Head Sri Ram Prasad, Chief Managers Sri Brahmaih, Sri Nagesh Kumar, VGO Manohar, DyEO Smt Parvati, EE Sri Krishna Reddy, AEO Sri Dhananjay were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఇక తిరుపతిలోనే శ్రీవాణి దర్శనం టికెట్లు
– మాధవం అతిథిగృహంలో కౌంటర్లు ప్రారంభించిన జేఈవో శ్రీ వీరబ్రహ్మం

తిరుపతి 30 నవంబరు 2022: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం శ్రీవాణి ట్రస్ట్ ఆఫ్ లైన్ టికెట్లు బుధవారం నుంచి తిరుపతి లోనే మంజూరు చేస్తున్నారు. మాధవం అతిథిగృహంలో ఏర్పాటు చేసిన ఈ కౌంటర్లను జేఈవో శ్రీ వీరబ్రహ్మం శాస్త్రోక్తంగా పూజలు చేసి ప్రారంభించారు. గుంటూరుకు చెందిన శ్రీ ఎన్ లక్ష్మి హరీష్, శ్రీమతి జి.రూప సింధు కు జేఈవో తొలి టికెట్ అందించారు.

అనంతరం శ్రీ వీరబ్రహ్మం మీడియాతో మాట్లాడుతూ, శ్రీవాణి ట్రిస్టు కు రూ 10 వేలు విరాళం ఇచ్చి రూ 500 చెల్లించే భక్తులకు ఇప్పటి దాకా తిరుమలలో ఆఫ్ లైన్ టికెట్లు జారీ చేస్తున్నారని చెప్పారు.

దాతలు ముందురోజు తిరుమలకు వెళ్ళి అవసరమైన పత్రాలు సమర్పించి టికెట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఈ ప్రక్రియలో దాతలు ఎదుర్కుంటున్న ఇబ్బందులు గుర్తించి టీటీడీ యాజమాన్యం శ్రీవాణి ఆఫ్ లైన్ టికెట్లు తిరుపతిలోనే జారీ చేసి ఇక్కడే వారికి వసతి గదులు కేటాయించేలా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. దీనివల్ల భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ కు సమీపంలో ఉన్న మాధవం గెస్ట్ హౌస్ నుంచి ఉదయాన్నే బయలు దేరి తిరుమలకు వెళ్ళవచ్చు నన్నారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా వచ్చే విరాళాలతో పురాతన ఆలయాల అభివృద్ధి, జీర్ణోద్ధరణ, కొత్తగా ఆలయాలు, భజన మందిరాలు నిర్మిస్తున్నామని శ్రీ వీరబ్రహ్మం తెలిపారు. ఈ ట్రస్టు ద్వారా తొలివిడత లో తెలుగు రాష్ట్రాల్లో 502 ఆలయాలు నిర్మించామన్నారు. రెండో విడతలో సుమారు 1500 ఆలయాల నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేసినట్లు ఆయన చెప్పారు. శ్రీవాణి ట్రస్టు కు విరాళం ఇచ్చే భక్తులు తిరుపతిలోని మాధవం అతిథిగృహం లో ఏర్పాటు చేసిన కౌంటర్లను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

ఈ కౌంటర్ల నిర్వహణకు ముందుకొచ్చిన యూనియన్ బ్యాంకు యాజమాన్యానికి జేఈవో కృతజ్ఞతలు తెలిపారు.

టీటీడీ చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, యూనియన్ బ్యాంకు రీజనల్ హెడ్ శ్రీ రాం ప్రసాద్, చీఫ్ మేనేజర్లు శ్రీ బ్రహ్మయ్య , శ్రీ నగేష్ కుమార్ , విజివో శ్రీ మనోహర్, డిప్యూటీ ఈవో శ్రీమతి పార్వతి, ఈఈ శ్రీ కృష్ణారెడ్డి, ఏఈవో శ్రీ ధనుంజయులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల ఆధికారిచే జారీ చేయడమైనది