Inauguration of TTD Employees Annual Sports and Games _ క్రీడలతో మానసిక ప్రశాంతత – టిటిడి ఈవో

Tirupati, 25 Jun. 10: Sri I.Y.R.Krisha Rao, Executive Officer, TTDs inaugurated Annual Sports & Games among the TTD Employees, their wives and their children for the year 2010 in TTD Adm Bldg, Tirupati.

 

TTD Joint Executive Officer Dr.N.Yuvaraj, C.V&S.O Sri M.K.Singh, Supdt Engineer Sri Sudhakar Rao, Addl C.V&S.O Sri Siva Kumar Reddy, employees and their families took part.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

క్రీడలతో మానసిక ప్రశాంతత – టిటిడి ఈవో

తిరుపతి, 2010 జూన్‌ 25: ఉద్యోగులు పని ఒత్తిడిని అధిగమించడానికి, మానసిక ప్రశాంతతకు,శరీర ధృఢత్వానికి క్రీడలు చాలా అవసరమని తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఐ.వై.ఆర్‌ కృష్ణారావు అన్నారు.

శుక్రవారం సాయంత్రం తితిదే పరిపాలన భవనం వెనుక వైపునున్న క్రీడామైదానంలో తితిదే ఉద్యోగుల వార్షిక క్రీడోత్సవాల ప్రారంభసభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఇ.ఒ.కృష్ణారావు క్రీడోత్సవాల జెండాను ఆవిష్కరించి, శాంతికి చిహ్నమైన కపోతాన్ని ఎగురవేసి క్రీడలను లాంఛనంగా ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది తితిదే ఉద్యోగులకు క్రీడలు నిర్వహించడం హర్షనీయమన్నారు. ఈ క్రీడలలో ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొనాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జె.ఇ.ఒ యువరాజు, సివిఎస్వో ఎం.కె.సింగ్‌, యస్‌.ఇ.సుధాకర్‌ ఇతర అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.