INAUGURATION OF WALKING TRACK IN TIRUPAT _ తితిదే పరిపాలనా భవనంలో వాకింగ్ ట్రాక్‌ను ప్రారంభించిన ఈవో
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తితిదే పరిపాలనా భవనంలో వాకింగ్ ట్రాక్‌ను ప్రారంభించిన ఈవో
తిరుపతి, జూలై 05, 2013: తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలో గల ఉద్యానవనంలో నూతనంగా ఏర్పాటుచేసిన వాకింగ్ ట్రాక్‌ను కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఉద్యోగులు, యాత్రికులు ఉదయం, సాయంత్రం వేళల్లో నడక ద్వారా వ్యాయామం చేసుకునేందుకు వీలుగా దీన్ని ఏర్పాటుచేసినట్టు తెలిపారు. రూ.8 లక్షల వ్యయంతో రూపొందించిన ఈ ట్రాక్ అర కిలోమీటరు పొడవు, 12 అడుగుల వెడల్పు ఉన్నట్టు వివరించారు. ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ కోసం ఈ ట్రాక్ ఏర్పాటుకు కృషి చేసిన విజిలెన్స్, ఇంజినీరింగ్ అధికారులను ఈ సందర్భంగా ఈవో అభినందించారు.
ఈ కార్యక్రమంలో తితిదే తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి, ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్‌కుమార్, చీఫ్ ఇంజినీర్ శ్రీ చంథ్రేఖర్‌రెడ్డి, ఎస్ఈలు శ్రీ రామచంద్రారెడ్డి, శ్రీ రమేష్‌కుమార్‌రెడ్డి, శ్రీ సుధాకరరావు, ఇతర అధికార ప్రముఖులు, తితిదే ఉద్యోగులు పాల్గొన్నారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.