INDIA IS THE SPIRITUAL AND CULTURAL EPITOME OF WORLD-VICE-PREZ_ ప్రపంచ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రం భారతదేశం
WORLD IS LOOKING AT OUR SPIRITUAL WISDOM TO LEAD A PEACEFUL LIFE
GREETS PEOPLE ON MAKARA SANKRANTHI
Tirumala, 11 January 2018: Expleasure his immense pleasure for having “Netra Darshan” of Lord Venkateswara along with his family after taking the reins as the Vice-President of India, Sri M Venkaiah Naidu said with this new spirit he will discharge his responsibilities with more dedication.
The honourable Vice-President Sri M Venkaiah Naidu, after coming out of darshan of Lord, speaking to media persons outside temple said, Hindu culture is the epitome of the world. Hinduism is not a religion or any cult but is a way of life as told by our ancestors, saintly persons like Sri Ramanujacharya. Our life as a human will become meaningful only if we help others. If not atleast, harm not others. Live and let others live. Keep all your egos, disparities and discriminations aside and follow the divine words of our predecessors who taught us “Sarve Jana Sukhinobhavanthu”, to lead a righteous way of life and live as “Vasudhaika Kutumbam” (universal family). People should live in peace and harmony on the this concept of universal brotherhood”, he asserted.
Complimenting the pilgrim initiatives taken by TTD authorities, the Vice President said, “TTD is doing impeccable services to multitude of visiting pilgrims. I seldom come for darshan of Lord, as every common individual should get the opportunity of Lord’s darshan. I came along with my family and our village folks during my childhood. But still I feel darshan of Lord afresh whenever I visit His abode. That is the magnificient power of Universal Lord Venkateswara”, he said.
Adding further, the Vice-President said, “Today, the entire World is looking at us because of our abundant ancient wisdom, culture, yoga and spiritual knowledge, as they are the tenets to lead a peaceful life”, he maintained.
Wishing every one “Makara Sankranthi” wishes, the Vice-President aspired that Sankranthi will bring “Navya Kranthi” (new light) in all our lives.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
ప్రపంచ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రం భారతదేశం
మకర సంక్రాంతి అందరి జీవితాల్లో నూతన కాంతులు నింపాలి :
ఉపరాష్ట్రపతి గౌ|| శ్రీ ఎం.వెంకయ్యనాయుడు
కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం
వైకుంఠం క్యూకాంప్లెక్స్ ద్వారా ప్రవేశం
ఆలయ సంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీ వరాహస్వామివారికి మొదట పూజలు
తిరుమల, జనవరి 11, 2018: ప్రపంచానికి ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రంగా భారతదేశం విరాజిల్లుతోందని, అందుకే విశీయులు మనదేశం వైపు చూస్తున్నారని భారత ఉపరాష్ట్రపతి గౌ|| శ్రీ ఎం.వెంకయ్యనాయుడు ఉద్ఘాటించారు. రానున్న మకర సంక్రాంతి తెలుగు ప్రజల అందరి జీవితాల్లో నూతన కాంతులు నింపాలని ఆకాంక్షించారు. గౌ|| ఉపరాష్ట్రపతి గురువారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ఉపరాష్ట్రపతిగా పదవీబాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారిగా శ్రీవారి దర్శనానికి విచ్చేశారు.
శ్రీవారి దర్శనానంతరం గౌ|| ఉపరాష్ట్రపతి ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ మకర సంక్రాంతి పర్వదినం ముందు తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకోవడం మహాభాగ్యమన్నారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన తరువాత మరింత పట్టుదలతో కర్తవ్యాన్ని నిర్వహించేందుకు తమ ఇలవేల్పు అయిన శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆశీస్సుల కోసం వచ్చినట్టు తెలిపారు. ‘హిందు’ ఒక మతం కాదని, జీవనవిధానంగా చూడాలని రామానుజాచార్యులు, వివేకానందుడు లాంటి మహనీయుడు బోధించారని చెప్పారు. ‘సర్వేజనా సుఖినోభవంతు’ అన్నట్టు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఇతరులకు ఉపయోగపడేలా జీవితం సాగించాలని పేర్కొన్నారు. భారతీయ జీవనంలో వారసత్వ సంస్కృతి, జ్ఞానం, యోగా, ఆధ్యాత్మికత ఉన్నాయని, అందుకే ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తోందని అన్నారు. సమాజంలో కులవివక్ష, అంటరానితనాన్ని రూపుమాపాలని, భారతీయులు సర్వమానవ సౌభ్రాతృత్వానికి పాటుపడి వసుధైక కుటుంబంగా వర్ధిల్లాలని ఆకాంక్షించారు. పురాణాల్లో చెప్పిన విధంగా ఆకలిదప్పులు లేని, అవినీతికి తావు లేని, వివక్ష లేని రామరాజ్యంగా దేశం విలసిల్లాలన్నారు. ప్రజందరూ అంకితభావంతో తమ విధులు నిర్వహిస్తే దేశం ముందుకెళుతుందన్నారు.
యాత్రికుల కోసం టిటిడి చేసిన ఏర్పాట్లు బాగున్నాయన్నారు. టిటిడి నిధులను భక్తులకు సౌకర్యాల కల్పనతోపాటు హిందూ ధర్మ పరిరక్షణకు వెచ్చించాలన్నారు. భక్తులందరికీ స్వామివారి దర్శనం కల్పించేందుకు ప్రముఖులందరూ సహకరించాలని కోరారు. చిన్నప్పట్లో గ్రామమంతా కలిసి 60 మంది ఒకసారి, 120 మంది మరోసారి వచ్చామని గుర్తు చేసుకున్నారు. శ్రీవారి దర్శనంతో తన్మయత్వం పొందుతాయని, ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిదని అన్నారు. చక్కటి దర్శన ఏర్పాట్లు చేసిన టిటిడి అధికారులకు, అర్చకులకు ఈ సందర్భంగా గౌ|| ఉపరాష్ట్రపతి కృతజ్ఞతలు తెలియజేశారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.