INDIAN MOTHERS ARE SYMBOL OF SAC0IFICE-SPEAKERS_ మహిళలు నిర్ణయాత్మక పాత్ర పోషించాలి : ఆచార్య కొలకలూరి మధుజ్యోతి

Tirupati, 8 March 2018: Indian Women are a symbol of Sacrifice, Love, Affection, expressed the speakers.

The International Women’s Day was observed with enthusiasm in SPW Degree and PG College in Tirupati on Thursday.

Speaking on this occasion, Special Officer All Projects, TTD Sri N Muktheswara Rao said women have the potential and patience to overcome all social evils with self confidence. He exemplified the women empowerment programme taken up with women who have settled in various fields when he was Collector in Nalgonda.

Speakers Dr K Madhujyothi, Head of Telugu Department wished the girl students who are the future women power of the nation to take up challenging fields like pilots of missiles etc.

While Diabetalogist Dr P Krishnaprasanthi enlightened the students on how to lead a balanced life both at home as well at work place.

Later Cardiologist Dr Vanajakshamma , renowned Veena expert Dr Kousalya, former DyEO KKC Smt Baby Sarojini were felicitated on this occasion.

Earlier in the morning cultural programs were performed which enthralled the students.

DyEOs Smt Goutami, Smt Snehalatha, Smt Kasturi Bai, Smt Varalakshmi, Smt Nagaratna, Medical Superintendent of Ayurvedic College Dr Parvathi, Principal of SPWDPG college Dr Ramani and others were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

మహిళలు నిర్ణయాత్మక పాత్ర పోషించాలి : ఆచార్య కొలకలూరి మధుజ్యోతి

టిటిడి ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం

మార్చి 08, తిరుపతి, 2018: ప్రస్తుతం అన్ని రంగాల్లో మహిళలు ప్రతిభ కనబరుస్తున్నారని, మరింతగా కృషి చేసి నిర్ణయాత్మక పాత్రను పోషించాలని శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ తెలుగు విభాగాధిపతి ఆచార్య కొలకలూరి మధుజ్యోతి పేర్కొన్నారు. టిటిడి ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ, పిజి కళాశాలలో గురువారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆచార్య మధుజ్యోతి కీలకోపన్యాసం చేశారు. మహిళలను గౌరవించుకోవడానికి మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. ఆకాశంలో సగంగా మహిళలను భావిస్తారని, అదేవిధంగా అన్ని రంగాల్లో సగభాగం ఉండేలా ఎదగాలని కోరారు. ఆశయం బలంగా ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చన్నారు. ప్రపంచవ్యాప్తంగా మహిళల పట్ల జరుగుతున్న వివక్షను రూపుమాపేందుకు చైతన్యవంతులు కావాలన్నారు. అమ్మ నిశ్శబ్దమైన శ్రమ అని, అమ్మ కళ్లతోనే ప్రపంచాన్ని చూస్తామని అన్నారు. అమ్మను గౌరవించాలని కోరారు.

తిరుపతికి చెందిన ప్రముఖ చక్కెర వ్యాధి నిపుణులు డా|| కృష్ణప్రశాంతి మాట్లాడుతూ మహిళా ఉద్యోగులు ఆరోగ్యం పట్ల ప్రత్యేకశ్రద్ధ వహించాలన్నారు. సమయపాలన, క్రమశిక్షణ ప్రతిఒక్కరూ పాటించాలని సూచించారు. ఉద్యోగం, కుటుంబ బాధ్యతలను చక్కగా నిర్వర్తించేందుకు మంచి ఆరోగ్యం ఉండాలని, ఇందుకోసం సమతుల ఆహారం తీసుకోవాలని కోరారు.

టిటిడి డెప్యూటీ ఈవో శ్రీమతి గౌతమి మాట్లాడుతూ స్ఫూర్తిదాయకంగా ఉండే చిన్న అంశాన్ని అయినా విజయంగానే భావించాలన్నారు. ప్రతి ఒక్కరికీ మొదటి గురువు తల్లి అని, మహిళలు పిల్లలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని సూచించారు. మహిళా ఉద్యోగులకు కుటుంబ సహకారం ఉండాలని, అప్పుడే చక్కగా విధులు నిర్వహించగలరని అన్నారు.

టిటిడి ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి శ్రీ ఎన్‌.ముక్తేశ్వరరావు మాట్లాడుతూ వివిధ రంగాల్లో ఉన్నతస్థాయికి చేరుకున్న మహిళలతో ఉపన్యాస కార్యక్రమాలు ఏర్పాటుచేయడం వల్ల మహిళా ఉద్యోగులు, విద్యార్థినులు స్ఫూర్తి పొంది మరింత రాణించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. సమాజంలో విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో మహిళలకు అవకాశాలు పెరుగుతున్నాయని చెప్పారు.

సన్మానం :

స్విమ్స్‌ కార్డియాలజి ప్రొఫెసర్‌ డా|| వి.వనజాక్షమ్మ, తంజావూరుకు చెందిన ప్రముఖ వీణ వాద్యకళాకారిణి డా|| ఆర్‌.కౌసల్య, ఎస్‌పిడబ్ల్యు కళాశాల మొదటి మహిళా ఉద్యోగి, రిటైర్డ్‌ డెప్యూటీ ఈవో శ్రీమతి బేజి సరోజిని, విశ్రాంత ఉద్యోగులు శ్రీమతి జి.నాగభూషణమ్మ, శ్రీమతి ఎ.పోలమ్మను శాలువ, శ్రీపద్మావతి అమ్మవారి చిత్రపటం, శ్రీవారి ప్రసాదంతో ఘనంగా సన్మానించారు.

అదేవిధంగా 2019, ఫిబ్రవరిలోపు ఉద్యోగ విరమణ చేయనున్న టిటిడి ఉద్యోగినులను ఈ సందర్భంగా సన్మానించారు. అదేవిధంగా, మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన టిటిడి మహిళా ఉద్యోగులు, విద్యార్థినులకు బహుమతులు ప్రదానం చేశారు.

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు :

మహిళా దినోత్సవం సందర్భంగా ఉదయం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంగీత విభావరి నిర్వహించారు. శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ, పిజి కళాశాల అధ్యాపకులు కోలాటం ప్రదర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు ప్రదర్శించిన నృత్య కార్యక్రమాలు, టిటిడి వైర్‌మెన్‌ శ్రీమతి సుమతి నృత్యం, శ్రీమతి అనూరాధ ‘స్త్రీ శక్తి’పై ఆలపించిన పాట, విద్యార్థినుల కరాటే ప్రదర్శన ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమానికి కళాశాల తెలుగు అధ్యాపకురాలు డా|| కృష్ణవేణి, టిటిడి సహాయ ప్రజాసంబంధాల అధికారిణి కుమారి పి.నీలిమ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి డెప్యూటీ ఈవోలు శ్రీమతి వరలక్ష్మి, శ్రీమతి నాగరత్న, శ్రీమతి ఝాన్సీ, శ్రీమతి స్నేహలత, ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డా|| వి.పద్మావతి, ఎస్‌పిడబ్ల్యు కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీమతి వి.వి.రమణి, ఎస్‌జిఎస్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీమతి ఎబి.శాంతి ఇతర మహిళ ఆధికారులు, సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.