JEO REVIEWS ON SSD SOFTWARE_ సర్వదర్శనం టైంస్లాట్‌ సాఫ్‌వేర్‌పై జెఈవో సమీక్ష

Tirumala, 8 March 2018: Tirumala JEO Sri KS Sreenivasa Raju reviewed with IT wing and TCS experts on Time-slot and Divya Darshanam software.

He learnt from the IT experts on the present technical glitches in Divuya Darshan token software.

Temple DyEO Sri.Harindranath, EDP Manager Sri.Bhaskar, OSD Sri Balaji Prasad, Sri Venkateswarulu Naidu, Sri Satya from TCS were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

మరింత స్వచ్ఛమైన ప్రాంతంగా తిరుమల

తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

మార్చి 08, తిరుమల 2018: స్వచ్ఛ భారత్‌లో భాగంగా తిరుమల క్షేత్రాన్ని మరింత స్వచ్ఛమైన, సుందరమైన ప్రాంతంగా తీర్చిదిద్దాలని తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు అధికారులను ఆదేశించారు. తిరుమలలోని జెఈవో క్యాంప్‌ కార్యాలయంలో గురువారం సాయంత్రం తిరుమలలో స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న పనులపై ఆధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా జెఈవో మాట్లాడుతూ కార్పొరేట్‌ సామాజిక బాధ్యతలో భాగంగా ఒఎన్‌జిసి వారు టిటిడికి ఇవ్వదలచిన మొత్తంలో ఈ ఆర్ధిక సంవత్సరం కొనుగోలు చేసిన వాటిపై సమీక్షించారు. టిటిడి విభాగాల వారీగా, ముఖ్యంగా ఇంజినీరింగ్‌, ఆరోగ్య విభాగం, అన్నప్రసాద విభాగాలలో కొనుగోలు చేసినది, కొనుగోలు చేయవలసిన పరికరాల విలువను ఒఎన్‌జిసికి పంపవలసిందిగా అధికారులను ఆదేశించారు. ఆధునాతన పరికరాలు ఉపయోగించడం ద్వారా తిరుమలను మరింత సుందరంగా తీర్చిదిద్దడానికి కృషి చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి సిఇ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఇ2 శ్రీ రామచంద్రరెడ్డి, ఆరోగ్య విభాగం అధికారి డా|| శర్మిష్ఠ, అన్నప్రసాదం ప్రత్యేకాధికారి శ్రీ వేణుగోపాల్‌, ఎస్‌ఇ ఎలక్ట్రికల్‌ శ్రీ వేంకటేశ్వర్లు, గార్డెన్‌ సూపరింటెండెంట్‌ శ్రీ శ్రీనివాసులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

సర్వదర్శనం టైంస్లాట్‌ సాఫ్‌వేర్‌పై జెఈవో సమీక్ష

అనంతరం జెఈవో టిటిడి ఐటి అధికారులతో సర్వదర్శనం టైంస్లాట్‌ సాఫ్ట్‌వేెర్‌, దివ్య దర్శనం సాఫ్ట్‌వేర్‌పై సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ దివ్యదర్శనం భక్తులకు ప్రస్తుతం జారీ చేస్తున్న టోకెన్లకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌లో ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా సర్వదర్శనం టైంస్లాట్‌కు సంబంధించిన ఐటి అప్లికేన్‌పై సమీక్షించారు.

ఈ కార్యక్రమంలో తిరుమల ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాధ్‌, ఇడిపి మేనేజరు

శ్రీ భాస్కర్‌, ఇడిపి ఒఎస్‌డిలు శ్రీ బాలాజి ప్రసాద్‌, శ్రీ వేంకటేశ్వర్లు నాయుడు, టిసిఎస్‌ అధికారి శ్రీ సత్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.