INTERNATIONAL WOMENS DAY CELEBRATIONS BY TTD ON MARCH 7 _ మార్చి 7న మహతిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుక‌లు

Tirupati, 04 March 2024: The International Women’s Day will be observed by TTD at Mahathi Auditorium in Tirupati on March 7 under the auspices of the TTD Welfare Department.

The program will start at 10 am.  On this occasion, talented women in various fields will be felicitated and address as keynote speakers. 

Regular and outsourcing female employees of TTD will participate in this program.

Essay writing, drawing and quiz competitions were conducted for women employees at SV Oriental College in  Tirupati on Monday while a Music competition will be conducted on March 5 at SV College of Music and Dance in honour of Women’s Day.

TTD Welfare Department Deputy EO Smt Snehalatha is supervising the arrangements.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

మార్చి 7న మహతిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుక‌లు

తిరుప‌తి, 2024, మార్చి 04: టీటీడీ ఆధ్వర్యంలో మార్చి 7వ తేదీ గురువారం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుగనుంది.

ఉదయం 10 గంట‌ల‌కు కార్యక్రమం ప్రారంభ‌మ‌వుతుంది. ఈ సందర్భంగా ప్ర‌ముఖ ఆధ్యాత్మిక ఉప‌న్యాస‌కురాలు శ్రీ‌మ‌తి అనంత‌ల‌క్ష్మి నందివాడ‌, ప్ర‌ముఖ గాత్ర‌సంగీత విద్వాంసురాలు శ్రీ‌మ‌తి ద్వారం ల‌క్ష్మి, మృదంగంలో మొట్ట‌మొద‌టిసారి ప‌ద్మ‌శ్రీ అవార్డు పొందిన మ‌హిళ శ్రీ‌మ‌తి సుమ‌తి నిడుమోలు, ఆసియ‌న్ గేమ్స్ కాంస్య ప‌త‌క విజేత‌, ప్ర‌ముఖ క్రీడాకారిణి కుమారి నందిని అగ‌సార త‌దిత‌రులు ముఖ్య వ‌క్తలుగా విచ్చేసి ప్రసంగిస్తారు. టీటీడీలోని రెగ్యుల‌ర్‌, ఔట్సోర్సింగ్ మ‌హిళా ఉద్యోగులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు. అదేవిధంగా ఈ సంవ‌త్స‌రంలో ఉద్యోగ విర‌మ‌ణ చేయ‌నున్న 60 మంది మ‌హిళా ఉద్యోగుల‌కు స‌న్మానం చేస్తారు.

మ‌హిళా దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని సోమ‌వారం తిరుప‌తిలోని ఎస్వీ ఓరియంట‌ల్ క‌ళాశాల‌లో మ‌హిళా ఉద్యోగుల‌కు వ్యాస‌ర‌చ‌న‌, డ్రాయింగ్, క్విజ్ పోటీలు నిర్వ‌హించారు.

టీటీడీ సంక్షేమ విభాగం డెప్యూటీ ఈవో శ్రీమ‌తి స్నేహ‌ల‌త‌ ఈ కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.