SILK VASTRAMS PRESENTED _ శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన చంద్రగిరి ఎమ్మెల్యే డా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
Tirupati, 04 March 2024: The Chandragiri MLA Dr. Chevireddy Bhaskar Reddy couple and TTD ex- officio board member Sri Chevireddy Mohit Reddy presented silk clothes to the Kalyana Venkateswara Swamy on Monday in honor of ongoing annual Brahmotsavam.
Dr. Bhaskar Reddy who reached the temple was welcomed by the JEO Sri VeeraBrahmam and the temple priests rendered a traditional welcome.
Spl Gr Deputy EO of the temple Smt Varalakshmi and other officials participated in this program.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన చంద్రగిరి ఎమ్మెల్యే డా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
తిరుపతి, 2024 మార్చి 04: శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సోమవారం చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు మరియు టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కలిసి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
ఆలయానికి చేరుకున్న డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులకు జెఈవో
శ్రీ వీరబ్రహ్మం, ఆలయ అర్చకులు, అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం ప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.