INTRODUCE TIRUNAMAM AT VAIKUNTHAM SECURITY CHECK POINT_ ఆన్‌లైన్‌లో 68,575 శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుదల : ‘డయల్‌ యువర్‌ ఈవో’లో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Tirumala, 5 October 2018: Tirunamadharana will be implemented to pilgrims coming for darshan of Lord Venkateswara with Srivari Sevakulu at the hi-fi security check point introduced in Vaikuntham I, said TTD EO Sri Anil Kumar Singhal.

While answering the calls of pilgrims from across the country, as a part of Dial your EO program on Friday, the EO responding to a caller Sri Kiran Kumar from Prakasam saying that his suggestion is well taken and TTD will implement the same from Saturday (October 6) onwards immediately as every pilgrim will be covered while undergoing frisking at this crucial point.

Another caller Sri Srinivasulu from Anantapur sought EO to streamline the darshan inside temple for the benefit of common pilgrims for which the EO said surprise inspections will be carried out inside the temple with senior officers to avoid misappropriation if any.

Smt Lakshmi Devi from Bengaluru sought EO to allot certain quota of tickets to aged people during Vaikunta Ekadasi to which EO answered that it is not possible as nearly 1.70lakh pilgrims throng Tirumala during that time and all the privilege darshans remain cancelled.

Another caller Sri Naresh from Parvathipuram of Vizianagaram sought EO to consider private business persons also in Parakamani Seva for which the EO said they will look into the possibilities. When Sri Satyanarayana from Hyderabad sought EO to relax age limit for Parakamani seva if the volunteers are healthy, EO said it is not possible to make selections based on health.

A caller Sri Prasad from Hyderabad suggested EO to train employees and srivari seva volunteers rendering service inside sanctum not to drag pilgrims in a harsh manner while another caller Sri Ramesh from Hyderabad also complained of the rude behavior of security at JEO Camp office in Tirumala to which the EO said they will be instructed and trained again in soft skills.

Sri Rajendra, a caller from Tiruchanoor brought to the notice of EO about the dumping yard located between Renigunta and Tiruchanoor road which is proving to be hazardous on the health of pilgrims passing by the way. Reacting to the caller the EO said though the issue is not under the purview of TTD necessary action will be initiated to reduce the problem by negotiating with concerned authorities.

While callers Sri Ramanarayana and Sri Krishna from Guntur, Sri Sunil Kumar from Prakasam suggested EO on online dip system to which EO replied them that whichever are feasible will be considered.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆన్‌లైన్‌లో 68,575 శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుదల : ‘డయల్‌ యువర్‌ ఈవో’లో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

తిరుమల, 05 అక్టోబరు 2018: శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించిన 2019, జనవరి నెల కోటాలో మొత్తం 68,575 టికెట్లను శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేసినట్లు టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. ఆన్‌లైన్‌ డిప్‌ విధానంలో 7,125 సేవా టికెట్లు విడుదల చేశామని, ఇందులో సుప్రభాతం 4,425, తోమాల 80, అర్చన 80, అష్టదళపాదపద్మారాధన 240, నిజపాదదర్శనం 2300 టికెట్లు ఉన్నాయని ప్రకటించారు. ఆన్‌లైన్‌లో జనరల్‌ కేటగిరిలో 61,450 సేవాటికెట్లు ఉండగా, వీటిలో విశేషపూజ 2,000, కల్యాణం 13,775, ఊంజల్‌సేవ 4,350, ఆర్జితబ్రహ్మూెత్సవం 7,975, వసంతోత్సవం 15,950, సహస్రదీపాలంకారసేవ 17,400 టికెట్లు ఉన్నాయని వివరించారు.

తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం జరిగింది. ఇందులో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానాలిచ్చారు.

1. అమూల్య – హైదరాబాద్‌.

ప్రశ్న: మార్చి నెలలో శ్రీవారి దర్శనానికి వచ్చాను. సౌకర్యాలు చక్కగా ఉన్నాయి. పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయి ?

ఈవో : ధన్యవాదాలు.

2. కృష్ణ – గుంటూరు, రమాదేవి – హైదరాబాద్‌.

ప్రశ్న: ఆన్‌లైన్‌ లక్కీడిప్‌లో 11 నెలలుగా ఆర్జితసేవల కోసం నమోదు చేసుకుంటున్నాను. మాలాంటి వారి కోసం కొన్ని టికెట్లు కేటాయించండి?

ఈవో : పరిశీలిస్తాం.

3. లక్ష్మీదేవి – బెంగళూరు, రాధాప్రసాద్‌ – కర్నూలు.

ప్రశ్న: వైకుంఠ ఏకాదశి నాటికి వృద్ధులకు ప్రత్యేక దర్శనం కల్పించండి? మహాలఘు దర్శనం వల్ల వృద్ధులు స్వామివారిని సరిగా చూడలేకపోతున్నారు?

ఈవో : వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవాలు లాంటి ప్రత్యేక రోజుల్లో సామాన్య భక్తుల సౌకర్యార్థం అన్ని రకాల ప్రత్యేక దర్శనాలను రద్దు చేయడం జరుగుతుంది. వృద్ధులకు, దివ్యాంగులకు రోజువారీ ప్రత్యేక దర్శనంతోపాటు నెలలో 2 సార్లు అదనంగా ఎక్కువ మందికి దర్శనం కల్పిస్తున్నాం.

వృద్ధులు, దివ్యాంగులకు చక్కటి సౌకర్యాలతో నూతన షెడ్‌ ఏర్పాటుచేశాం. ఇప్పటికే వృద్ధులకు, దివ్యాంగులతోపాటు చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక క్యూలైన్‌ ద్వారా శ్రీవారి దర్శనం కల్పిస్తున్నాం.

4. సునీల్‌కుమార్‌ – ప్రకాశం, రామనారాయణ – గుంటూరు.

ప్రశ్న: ఫొటో తప్పనిసరి చేస్తే ఆన్‌లైన్‌ లక్కీడిప్‌లో అవకతవకలను అరికట్టవచ్చు?

ఈవో : ఆన్‌లైన్‌ లక్కీడిప్‌ విధానంలో సాంకేతికంగా ఎలాంటి లోపాలు లేవు. ఇంటర్నెట్‌ సౌకర్యం సరిగా లేని గ్రామీణ ప్రాంతాల భక్తుల కోసం ఫోటోను తప్పనిసరి చేయడం లేదు. అదేవిధంగా, ఇంటర్నెట్‌ సెంటర్ల నిర్వాహకులు ఒకే ఫోన్‌ నంబరు నుండి ఎక్కువ మందికి టికెట్లు నమోదు చేస్తున్నారు. వచ్చే నెల నుండి ఒక ఫోన్‌ నంబరు నుండి ఇద్దరికి మాత్రమే నమోదు చేసుకునేలా మార్పులు తీసుకొస్తాం.

5. నరేష్‌ – పార్వతిపురం.

ప్రశ్న: పరకామణి సేవలో వ్యాపారులకు అవకాశం కల్పించండి ?

ఈవో : పరిశీలిస్తాం.

6. గోపాలకృష్ణ – నూజివీడు.

ప్రశ్న: ఎస్వీబీసీలో ప్రసారం చేస్తున్న ఆధ్యాత్మిక విశేషాల్లో షిరిడీసాయి ఆలయం గురించి సమాచారం ఇవ్వండి ?

ఈవో : షిరిడీసాయి ఆలయం గురించి వారి వెబ్‌సైట్‌లో చక్కటి వివరాలున్నాయి. ఎస్వీబీసీలో శ్రీవారి సేవలు, ఇతర ధర్మప్రచార కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నాం.

7. కిరణ్‌కుమార్‌ – మార్కాపురం.

ప్రశ్న: స్కానింగ్‌ పాయింట్‌ వద్ద భక్తులందరికీ తిరునామం పెట్టండి ?

ఈవో : ఇప్పటికే అన్ని క్యూలైన్ల ప్రవేశమార్గాల్లో తిరునామం పెడుతున్నాం. స్కానింగ్‌ పాయింట్‌ వద్ద కూడా తిరునామధారణ చేయిస్తాం.

8. శ్రీనివాసులు – అనంతపురం.

ప్రశ్న: సిసి కెమెరాలకు కూడా దొరక్కుండా టిటిడి సిబ్బంది, పోలీసులు క్యూలైన్లలోకి తమవారిని దర్శనానికి తీసుకెళుతున్నారు? ఆలయంలో అయ్యవార్లు డబ్బులిస్తే ప్రసాదాలిస్తున్నారు?

ఈవో : అధికారులతో తనిఖీలు నిర్వహించి ఇకపై అలా జరగకుండా చూస్తాం.

9. రామారావు – విశాఖ.

ప్రశ్న: సిఫార్సు లేఖలపై గదులిస్తారా?

ఈవో : ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై నిర్దేశించిన కోటా మేరకు గదులు కేటాయిస్తాం. ప్రత్యేక పర్వదినాలు, రద్దీ రోజుల్లో సామాన్య భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సిఫారసు లేఖలు స్వీకరించబడవు. గదులు దొరక్కపోతే లాకర్ల ద్వారా వసతి పొందొచ్చు.

10. సత్యనారాయణ – హైదరాబాద్‌.

ప్రశ్న: లడ్డూప్రసాద సేవ వయోపరిమితిని 70 సంవత్సరాలకు పెంచండి?

ఈవో : పరిశీలిస్తాం.

11. ప్రసాద్‌ – హైదరాబాద్‌.

ప్రశ్న: శ్రీవారి ఆలయంలో పురుష సేవకులు మహిళలను, మహిళా సేవకులు పురుషులను లాగేస్తున్నారు? వృద్ధుల ప్రత్యేక దర్శనం వయోపరిమితిని 60 ఏళ్లకు తగ్గించండి?

ఈవో : భక్తులను లాగకూడదని శ్రీవారి సేవకులకు, సిబ్బందికి స్పష్టంగా ఆదేశాలిస్తాం. భక్తులు ఎవరికివారు ముందుకు కదిలితే ఇలాంటి సమస్య ఉండదు. నడవలేనివారు, దివ్యాంగుల కోసమే ప్రత్యేక క్యూలైన్‌ ఏర్పాటుచేసి దర్శనం కల్పిస్తున్నాం.

12. రాజేంద్రవర్మ – తిరుచానూరు.

ప్రశ్న: రేణిగుంట- తిరుచానూరు రోడ్డులో డంపింగ్‌ యార్డుతో సమస్యగా ఉంది?

ఈవో : స్థానిక అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటాం.

13. రమేష్‌ – హైదరాబాద్‌.

ప్రశ్న: వేసవిలో వచ్చాను. జెఇవో కార్యాలయం వద్ద సిబ్బంది లోనికి అనుమతించలేదు?

ఈవో : వేసవిలో అధిక రద్దీ కారణంగా బ్రేక్‌ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించలేదు. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. అక్కడి సిబ్బందికి తగిన సూచనలిస్తాం.

ఈ కార్యక్రమంలో టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, శ్వేత సంచాలకులు శ్రీఎన్‌.ముక్తేశ్వరరావు, ఇన్‌చార్జి సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, విఎస్‌వో శ్రీ రవీంద్రారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.