IOC CHAIRMAN VISITS SV GOSAMRAKSHANASHALA _ ఎస్వీ గోసంరక్షణశాలను సంద‌ర్శించిన ఐఒసిఎల్ చైర్మ‌న్‌

Tirupati, 24 August 2022: Indian Oil Corporation Chairman Sri Srikant Madhav on Sunday visited the SV Gosamrakshanasala at Tirupati and lauded the contributions of TTD in the development of Gosamrakshanasalas and the protection of desi breed of bovines.

 

Earlier the IOC Chairman along with family members performed Go puja and Archana at Sri Venugopal Swami Sannidhi and also fed fodder to the animals.

He also congratulated TTD EO Sri AV Dharma Reddy and JEO Sri Veerabrahmam for their stellar contributions in realm of promoting Gosamrakshanasala and desi breed of cows.

   

TTD Gosala Director Dr Harnath Reddy and Gosala employees were present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఎస్వీ గోసంరక్షణశాలను సంద‌ర్శించిన ఐఒసిఎల్ చైర్మ‌న్‌

తిరుప‌తి, 2022 ఆగ‌స్టు 14: తిరుపతి శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణ శాలను ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ చైర్మన్ శ్రీ శ్రీకాంత్ మాధవ్ వైద్య కుటుంబ సమేతంగా ఆదివారం సందర్శించారు. ఈ సంద‌ర్భంగా శ్రీ వేణుగోపాల స్వామివారి సన్నిధిలో అర్చన, గోపూజ ను నిర్వహించారు. అనంతరం వారు గోశాలలో గోవులకు దాణా, పశుగ్రాసం అందజేశారు.

గో సంరక్షణశాల అభివృద్ధికి, గోశాలలో దేశవాళీ గోజాతుల పరిరక్షణకు టీటీడీ తీసుకుంటున్న‌ నిర్ణయాల పట్ల శ్రీ శ్రీ‌కాంత్‌ సంతోషాన్ని వ్యక్తం చేశారు. టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, జెఈవో శ్రీ వీరబ్రహ్మం గోశాల అభివృద్ధికి చేస్తున్న కృషిని ఆయ‌న అభినందించారు.

ఈ కార్యక్రమంలో గోశాల సంచాలకులు డా.హరనాథ్ రెడ్డి, గోశాల సిబ్బంది పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.