ALL SET FOR ID CELEBRATIONS AT THE TTD ADMIN BUILDING _ టీటీడీ పరిపాలనా భవనంలో స్వాతంత్య్ర దినోత్స‌వ‌ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి

టీటీడీ పరిపాలనా భవనంలో స్వాతంత్య్ర దినోత్స‌వ‌ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి

తిరుపతి, 2022 ఆగస్టు 14: ఆగస్టు 15న నిర్వహించే భారత స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుకలకు టీటీడీ సిద్ధమయింది. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ప్రాంగణంలో గల పరేడ్‌ మైదానంలో వేదికను అందంగా ముస్తాబు చేశారు. సోమవారం ఉదయం 8.30 గంటలకు ఈ వేడుకలు ప్రారంభమవుతాయి.

జెండా వందనం అనంతరం టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తరువాత విధుల్లో ఉత్తమ సేవలు అందించిన వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులకు ఐదు గ్రాముల వెండి డాలర్‌, ప్రశంసాపత్రాలు అందజేస్తారు. చివరగా టీటీడీ విద్యాసంస్థల విద్యార్థులు, ఉద్యోగుల పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తారు. అనంత‌రం టీటీడీ ప‌రిపాల‌న భ‌వ‌నం నుండి మ‌హ‌తి క‌ళాక్షేత్రం వ‌ర‌కు ఉద్యోగుల‌తో భారీ ర్యాలీ నిర్వ‌హించ‌నున్నారు. స్వాతంత్ర వ‌జ్రోత్స‌వాల సంద‌ర్భంగా కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాల పిలుపు మేర‌కు టీటీడీ ఆజాదీకా అమృతోత్స‌వ్ వేడుక‌ల‌ను టీటీడీలోని అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులు నిర్వ‌హిస్తున్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Tirupati, 14 August 2022: TTD has made all arrangements for the 76th Independence Day celebrations at the TTD Administrative Building for August 15.

 

TTD Engineering Department has set up a well-decorated podium at the Parade ground and festivities will begin at 8.30 am with the tricolour flag hoisting and address by the TTD EO Sri AV Dharma Reddy. Later he will present the certificates and medals to employees of all departments who rendered meritorious services.

 

Among others festivities includes cultural programs by students and children of TTD employees and a massive rally by employees up to the Mahati auditorium from TTD administrative building marking the occasion of Azadika Amrit Mahotsav by TTD officials and employees.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI