J AND K GUV LAUDS TTD ARRANGEMENTS _ కోవిడ్-19 నేప‌థ్యంలో తిరుమ‌ల‌లో ప‌రిశుభ్ర‌త చ‌ర్య‌లు భేష్ : జ‌మ్మూ అండ్ కాశ్మీర్ లెఫ్టినెంట్ గ‌వ‌‌ర్న‌ర్ శ్రీ మ‌నోజ్ సిన్హా

Tirumala, 6 Nov. 20: The arrangements made by TTD management keeping in view the health security of pilgrims visiting for darshan of Lord Venkateswara are highly commendable, lauded the Lt. Governor of Jammu and Kashmir, Sri Manoj Sinha.

The first citizen of the J and K, had darshan of Lord Venkateswara on Friday in Tirumala temple. On his arrival at the entrance of the temple, he was accorded a warm welcome by the TTD Chairman Sri YV Subba Reddy, EO Dr KS Jawahar Reddy and Additional EO Sri AV Dharma Reddy. Later he was rendered Vedasirvachanam in Ranganayakula Mandapam by Vedic Pundits. The Chairman and EO presented a lamination photo of Lord along with Theerthaprasadams to the dignitary.

After darshan of Lord Venkateswara, talking to the media outside the temple, the first citizen of Jammu and Kashmir said, the Covid measures and maintenance of clean environs by the TTD management are praiseworthy.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

కోవిడ్-19 నేప‌థ్యంలో తిరుమ‌ల‌లో ప‌రిశుభ్ర‌త చ‌ర్య‌లు భేష్ : జ‌మ్మూ అండ్ కాశ్మీర్ లెఫ్టినెంట్ గ‌వ‌‌ర్న‌ర్ శ్రీ మ‌నోజ్ సిన్హా

తిరుమల, 2020 న‌వంబ‌రు: ప‌విత్ర పుణ్య‌క్షేత్ర‌మైన తిరుమ‌ల‌లో కోవిడ్-19 నేప‌థ్యంలో ప‌రిశుభ్ర‌తా చ‌ర్య‌లు మెరుగ్గా ఉన్నాయ‌ని జ‌మ్మూ అండ్ కాశ్మీర్ లెఫ్టినెంట్ గ‌వ‌‌ర్న‌ర్ శ్రీ మ‌నోజ్ సిన్హా ప్ర‌శంసించారు. గౌ|| గవ‌ర్న‌ర్ శుక్ర‌వారం ఉద‌యం శ్రీ‌వారి నిజ‌పాద ద‌ర్శ‌న సేవ‌లో పాల్గొన్నారు. అనంత‌రం విఐపి బ్రేక్‌లో శ్రీవారిని దర్శించుకున్నారు.

ఆల‌యం వెలుప‌ల గౌ|| గవర్నర్‌ మీడియాతో మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. భ‌క్తుల ఆరోగ్య‌భ‌ద్ర‌త‌ను దృష్టిలో ఉంచుకుని ప‌టిష్టంగా క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టార‌ని టిటిడి యంత్రాంగాన్ని కొనియాడారు.

ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గౌ|| గవర్నర్‌కు టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి కలిసి సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా స్వాగతం పలికి ద‌ర్శ‌న ఏర్పాట్లు చేశారు. శ్రీ‌వారి ద‌ర్శ‌నానంత‌రం రంగనాయకుల మండపంలో  గౌ|| గవర్నర్‌కు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా టిటిడి ఛైర్మ‌న్‌, ఈవో, అద‌న‌పు ఈవో క‌లిసి తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని అందించారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.