JEEYAR OF VANAMAMALAI MUTT OFFERS PRAYERS AT TIRUMALA TEMPLE_ శ్రీవారిని దర్శించుకున్న శ్రీ వానమామలై జీయర్‌ స్వామి

Tirumala, 5 December 2017: HH SRIMATH PARAMAHAMSETHYANTHI MADHURAKAVI SRI VANAMAMALI JEEYAR SWAMY, SRI VANAMAMALI MUTT, NANGUNERI offered prayers to Lord Venkateswara in Tirumala on Tuesday morning. On his arrival infront of Srivari Temple TTD EO Sri Anil Kumar Singhal, Tirumala JEO Sri KS Sreenivasa Raju and Temple priests welcomed him with temple honors and led him to Sanctum Santorium.

Temple DyEO Sri Rama Rao, OSD Sri Seshadhri, Bokkasam incharge Sri Gururaja Rao, Parpatheyadar Sri Ramachandra and others were present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI

శ్రీవారిని దర్శించుకున్న శ్రీ వానమామలై జీయర్‌ స్వామి

డిసెంబరు 05, తిరుమల, 2017: తమిళనాడు రాష్ట్రం నంగునేరిలోని శ్రీ వానమామలై మఠాధిపతి శ్రీమత్‌ పరమహంస ఇత్యాది మధురకవి వానమామలై రామానుజ జీయర్‌స్వామివారు మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

స్వామిజీ ముందుగా పాత అన్నదాన భవనం వద్ద గల రావిచెట్టు వద్దకు చేరుకున్నారు. టిటిడి అర్చకస్వాములు, ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు ఇస్తికఫాల్‌ స్వాగతం పలికి శ్రీ బేడీ ఆంజనేయస్వామివారి దర్శనం చేయించారు. అక్కడ శఠారి సమర్పించి మేళతాళాల మధ్య శ్రీవారి ఆలయంలోకి తీసుకెళ్లి దర్శనం చేయించి, తీర్థప్రసాదాలు అందజేశారు.

శ్రీ వానమామలై మఠానికి 31వ మఠాధిపతిగా శ్రీమత్‌ పరమహంస ఇత్యాది మధురకవి వానమామలై రామానుజ జీయర్‌స్వామివారు కొనసాగుతున్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీవారి డెప్యూటీ ఈవో శ్రీ కోదండరామారావు, ఒఎస్‌డి పాల శేషాద్రి, బొక్కసం ఇన్‌చార్జ్‌ శ్రీ గురురాజస్వామి, ఇతర అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.