SSD TRIAL RUN SOON-TIRUMALA JEO_ ముమ్మరంగా సర్వదర్శనం టోకెన్‌ జారీ కౌంటర్ల పనులు

Tirupati, 5 December 2017: The trial run of Slot-wise Sarva Darshanam (SSD) will be soon implemented at 117 counters in 14 locations at Tirumala, said Tirumala JEO Sri KS Sreenivasa Raju.

A review meeting with Engineering, EDP, Annapasadam and Vigilance departments was held in Sri Padmavathi Rest House in Tirupati on Tuesday evening by JEO. Speaking on this occasion, the JEO said, civil works and electrical works will get completed in another five days. He said 40 information monitors will also be set up at various places for the information of pilgrim public.

He said already TTD making Aadhaar mandatory for SSD has gone well in to the masses. However those who do not bring Aadhaar card will be sent as usual through Vaikuntham Queue Complex II Sarva Darshan counters. He also directed the Engineering and PR wings to prepare flex boards in different languages for the information of pilgrims and erect them at various vital places in Tirumala.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI

ముమ్మరంగా సర్వదర్శనం టోకెన్‌ జారీ కౌంటర్ల పనులు :

డిసెంబరు 05, తిరుమల, 2017: ముందుగా సర్వదర్శనం టోకెన్‌ జారీ కౌంటర్లపై శ్రీవారి ఆలయం, ఇంజినీరింగ్‌, అన్నదానం, విజిలెన్స్‌ అధికారులతో తిరుమల జెఈవో శ్రీ కెఎస్‌.శ్రీనివాసరాజు సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ సర్వదర్శనం భక్తులకు టైంస్లాట్‌ విధానాన్ని అమలుచేసేందుకు ఉద్దేశించిన టోకెన్‌ జారీ కౌంటర్ల పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని వెల్లడించారు. తిరుమలలోని 14 ప్రాంతాలలో 117 కౌంటర్లను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ఆయా విభాగాల అధికారులు సమన్వయం చేసుకుని కౌంటర్లకు కావాల్సిన మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తిరుమలలో కొన్ని ప్రాంతాల్లో తాత్కాలిక ప్రాతిపదికన కౌంటర్లు ఏర్పాటుచేశామని, ప్రయోగాత్మకంగా టోకెన్లు జారీ చేసే రోజులకు మాత్రమే అద్దె చెల్లిస్తామని వెల్లడించారు. ఆధార్‌తో మాత్రమే ఈ కౌంటర్లలో టోకెన్లు జారీ చేస్తామని, ఆధార్‌ లేని భక్తులు యథావిధిగా సర్వదర్శనం కంపార్ట్‌మెంట్ల ద్వారా శ్రీవారిని దర్శించుకోవచ్చని తెలియజేశారు.

ఈ సమావేశంలో ఎస్‌ఈ 2 శ్రీ రామచంద్రారెడ్డి, ఎస్‌ఈ ఎలక్ట్రికల్స్‌ శ్రీ వేంకటేశ్వర్లు, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ కోదండరామరావు, అన్నదానం డిప్యూటీ ఈవో శ్రీ వేణుగోపాల్‌, డిఇ ఎలక్ట్రికల్స్‌ శ్రీమతి సరస్వతి, ఇడిపి మేనేజర్‌ శ్రీ భాస్కర్‌, ఓఎస్‌డి శ్రీ బాలాజిప్రసాద్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.