JEO REVIEWS ON TIRUMALA DEVELOPMENTAL ACTIVITIES_ తిరుమలలో జరుగుతున్న అబివృద్ధి పనులపై జెఈవో సమీక్ష

Tirumala, 25 Dec. 18: The Tirumala Joint Executive Officer Sri KS Sreenivasa Raju today urged officials to speed up pace and coming all Ongoing developmental activities.

Speaking at the review meeting in Annamaiah Bhavan this morning The JEO complimented all officials for successful serving lakhs of devotees during recent Vaikunta Ekadasi and Dwadasi festivals in Tirumala. He elicited suggestions and experience from each section heads and said it would be useful in preparations for V Day festivals next year.

Similarly he instructed engineering officials to take effective steps for queue line maintenance, Anna Prasadam distribution and hygiene, sanitation etc. at Tirumala during holidays and oncoming devotee rush.

Chief Engineer Sri Chandrasekhar Reddy, DyEO Sri Harindranath, SE-2, Sri Ramachandra Reddy and SE (Electrical) Sri Venkateswarlu were present in the meeting.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమలలో జరుగుతున్న అబివృద్ధి పనులపై జెఈవో సమీక్ష

తిరమల, 2018 డిసెంబర్‌ 25: తిరుమలలో భక్తుల సౌకర్యార్థం జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరిత గతిన పూర్తిచేయాలని టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు అధికారులను ఆదేశించారు.

తిరుమలలో మంగళవారం ఉదయం అన్నమయ్య భవన్‌లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలలో శ్రీవారి దర్శనార్ధం విచ్చేసిన లక్షలాది మంది భక్తులకు అద్భుతమైన సేవలందించిన టిటిడి అధికారులు, ఉద్యోగులు, పోలీస్‌, ఆర్‌టిసి, జిల్లా యంత్రాగానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన విభాగాల వారిగా అధికారుల నుండి సూచనలు, అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. వచ్చే సంవత్సరం తిరుమలలో రథసప్తమి, గరుడసేవ, వైకుంఠ ఏకాదశి, అధిక రద్దీ రోజులలో భక్తులకు మరింత మెరుగైన సేవలందించేందుకు తీసుకోవలసిన చర్యలపై చర్చించారు.

అదేవిధంగా వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలలో అనుహ్యంగా పెరిగిన భక్తుల రద్ధీ దృష్ట్యా వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. క్యూలైన్ల నిర్వహణ, అన్నప్రసాదాల పంపిణీ, పారిశుద్ద్యం తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. కాగా తిరుమలలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఇంజినీరింగ్‌ అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టిటిడి సిఇ శ్రీ చంద్రశేఖర్‌ రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాధ్‌, ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రరెడ్డి, ఎస్‌ఇ(ఎలక్ట్రికల్‌) శ్రీ వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.