JEO APPRECIATES SHILPAKALA EXPO _ శిల్ప‌ క‌ళా ప్ర‌ద‌ర్శ‌న బాగుంది- జెఈవో శ్రీ వీరబ్రహ్మం ప్రశంస

TIRUPATI, 01 MARCH 2022: TTD JEO Sri Veerabrahmam on Monday appreciated the talent of students of sculpture in the Exhibition cum Sale arranged at TTD run traditional sculpture institution near Alipiri in Tirupati on Monday.

He visited all the exhibits made by students displayed in the Exhibition and also purchased a few artistic works.

FACAO Sri Balaji, DEO Sri Govindarajan, Principal of SVITSA Sri Venkat Reddy were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శిల్ప‌ క‌ళా ప్ర‌ద‌ర్శ‌న బాగుంది- జెఈవో శ్రీ వీరబ్రహ్మం ప్రశంస

తిరుపతి, 2022 మార్చి 1: టిటిడి శ్రీ వేంక‌టేశ్వ‌ర సంప్ర‌దాయ ఆల‌య నిర్మాణ శిల్ప శిక్ష‌ణ సంస్థ‌లో ఏర్పాటు చేసిన శిల్పకళల ప్రదర్శన చాలా బాగుందనిజెఈవో శ్రీ వీరబ్రహ్మం ప్రశంసించారు. మంగళవారం సాయంత్రం ఆయన ప్రదర్శనను తిలకించారు. విద్యార్థుల హస్త కళా నైపుణ్యం బాగుందన్నారు.

తిరుపతి అలిపిరి వ‌ద్ద గ‌ల శిల్ప క‌ళాశాల‌లో ఫిబ్రవరి 26వ తేదీ ప్రారంభించిన ఈ ప్రదర్శన ఆరు రోజుల పాటు నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఇందులో వివిధ కళాఖండాల‌ ప్రదర్శన మ‌రియు విక్రయాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీ వీరబ్రహ్మం అన్ని కళా ఖండాలను పరిశీలించి ఒక దాన్ని కొనుగోలు చేశారు.

ఎఫ్ఎసిఎఒ శ్రీ బాలాజి, దేవస్థానం విద్యాశాఖాధికారి శ్రీ సి.గోవిందరాజన్, ప్రిన్సిపాల్
శ్రీ వెంకటరెడ్డి పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.