JEO (H & E) REVIEWS BIRRD DEVELOPMENT WORKS _ బర్డ్ అభివృద్ధి పనులపై జెఈవో సమీక్ష

TIRUPATI, 09 MAY 2023: The Joint Executive Officer of TTD for Health and Education Smt Sada Bhargavi reviewed the status of development works in the TTD-run Balaji Institute of Research, Rehabilitation and Surgery for the Disabled on Tuesday afternoon in the Hospital.

During the review meeting along with BIRRD OSD Dr Reddeppa Reddy and other officials from Engineering, Forest, Vigilance etc. the JEO directed the concerned to complete the works of seating arrangements, cafetaria, RO plant shed, Fire extinguishers, food serving area for the attendants of patients etc.on a fast pace.

She also instructed the Vigilance and Security wing officials to enhance the security for the hospital and keep a strict vigil on unauthorised entries. The JEO also discussed with the CEO SVBC Sri Shanmukh Kumar, who is also the DFO Incharge on developing greenery and enhancing the ambience of the hospital. 

EEs Sri Krishna Reddy, Sri Manoharam, DE Electrical Smt Saraswathi and others were also present.

Later she held a meeting with the Doctors, Paramedics to know about their issues, if any, related to their profession and work place. She also directed the BIRRD OSD to give wide publicity about the Mobile App for the benefit of the patients.

RMO Dr Kishore, Dr Ramamurthy, Dr Venugopal, Dr Pradeep, and other doctors, nursing staff were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

బర్డ్ అభివృద్ధి పనులపై జెఈవో సమీక్ష

తిరుపతి, 2023, మే 09: టిటిడి ఆధ్వర్యంలోని బర్డ్ ఆసుపత్రిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై మంగళవారం మధ్యాహ్నం ఆసుపత్రిలో జెఈవో శ్రీమతి సదా భార్గవి సమీక్ష నిర్వహించారు. బర్డ్ ప్రత్యేకాధికారి డాక్టర్ రెడ్డెప్ప రెడ్డితోపాటు ఇంజినీరింగ్, ఫారెస్ట్, విజిలెన్స్ తదితర విభాగాల అధికారులతో సమీక్ష జరిగింది.

ఇందులో సీటింగ్ ఏర్పాట్లు, ఫలహారశాల, ఆర్వో ప్లాంట్ షెడ్, అగ్నిమాపక పరికరాలు, రోగుల సహాయకులకు అన్నప్రసాదాల పంపిణీ ప్రాంతం పనులను పూర్తి చేయాలని జెఈవో సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఆసుపత్రికి భద్రతను పెంచాలని, అనధికార ప్రవేశాలపై గట్టి నిఘా ఉంచాలని నిఘా మరియు భద్రతాధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలో పచ్చదనాన్ని పెంపొందించడంపై ఇన్చార్జి డిఎఫ్‌ఓ, ఎస్‌విబిసి సిఇఓ శ్రీ షణ్ముఖ్ కుమార్‌తో జెఈవో చర్చించారు.

ఈఈలు శ్రీ కృష్ణారెడ్డి, శ్రీ మనోహరం, డీఈ ఎలక్ట్రికల్ శ్రీమతి సరస్వతి తదితరులు పాల్గొన్నారు.

అనంతరం జెఈవో డాక్టర్లు, పారామెడికల్ సిబ్బందితో సమావేశం నిర్వహించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మొబైల్ యాప్ గురించి విస్తృత ప్రచారం చేయాలని ప్రత్యేకాధికారిని ఆదేశించారు.

ఆర్‌ఎంఓ డాక్టర్‌ కిషోర్‌, డాక్టర్‌ రామ్మూర్తి, డాక్టర్‌ వేణుగోపాల్‌, డాక్టర్‌ ప్రదీప్‌, ఇతర వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.