VEDIC ESSENCE IS EMBEDDED IN ANNAMAIAH SANKEERTANS-PROF.RAGHUNATHA SHARMA _ అన్నమయ్య సంకీర్తనల్లో వేదాంత విషయాలు : ఆచార్య శలాక రఘునాథ శర్మ

TIRUPATI, 09 MAY 2023: Saint Poet Sri Tallapaka Annamacharya is rightly titled as “Padakavita Pitamaha” with the ease of Telugu literature he used in his Sankeertans which are nothing but the essence of Vedas for the sake of common man, said renowned Scholar Prof.Salaka Raghunatha Sharma of Kakinada.

 

Speaking at the Annamacharya Kalamandiram in Tirupati on Tuesday as part of ongoing Annamacharya Jayanti festivities, the scholar who presided over the literary session on fourth day said among the various formats of sankeertans penned by Annamacharya, Bhakti is the main subject and object. Scholars Sri Venkatacharyulu, Sri GK Sundaram also spoke on the occasion. 

 

In the evening there will be the Annamacharya musical fiesta by Smt Suseela and her team followed by the Harikatha Parayanam by Sri Chandra Sekhar. 

 

Annamacharya Project Director Dr Vibhishana Sharma, other staff, devotees were present.

 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అన్నమయ్య సంకీర్తనల్లో వేదాంత విషయాలు : ఆచార్య శలాక రఘునాథ శర్మ

తిరుపతి, 2023 మే 09: అచ్చ తెలుగులో అలతి అలతి పదాలతో అన్నమయ్య రచించిన సంకీర్తనల్లో వేదాంత విషయాలు దాగి ఉన్నాయని రాజమండ్రికి చెందిన ప్రముఖ పండితులు ఆచార్య శలాక రఘునాథ శర్మ తెలిపారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో జరుగుతున్న శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 615వ జయంతి ఉత్సవాలు మంగళవారం నాలుగో రోజుకు చేరుకున్నాయి.

ఈ సందర్భంగా నిర్వహించిన సాహితీ సదస్సుకు అధ్యక్షత వహించిన ఆచార్య శలాక రఘునాథ శర్మ “అన్నమయ్య – వేదాంతం” అనే అంశంపై ఉపన్యసించారు. అన్నమయ్య ప్రధానంగా భక్తి, శృంగార, ఆధ్యాత్మ సంకీర్తనలు రచించారని, ఈ మూడింటిలోనూ భక్తి ప్రధానంగా కనిపిస్తుందని చెప్పారు. పలు సంకీర్తనల్లో మహావిష్ణువును నీలవర్ణుడిగా చెప్పారని, ఇందులో నీలవర్ణం అనంతమైన ఆకాశాన్ని, సముద్రాన్ని సూచిస్తుందని, వేదాంతపరంగా ఈ విధంగా సంబోధించారని వివరించారు.

అనంతరం తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం అతిథి అధ్యాపకులు శ్రీ ఆర్.వెంకటాచార్యులు “అన్నమయ్య సాహిత్య దృష్టి” అనే అంశంపై ఉపన్యసిస్తూ అన్నమయ్య సాహిత్యానికి ప్రత్యేక శైలి ఉందని, సంకీర్తనల్లో ఆర్ష విజ్ఞానాన్ని పొందుపరిచారని తెలియజేశారు.

తిరుపతికి చెందిన శ్రీ జికె.సుందరం “అన్నమయ్య సాహిత్యం – అలమేలుమంగ” అనే అంశంపై ఉపన్యసిస్తూ అన్నమయ్య తన సంకీర్తనల్లో శ్రీవారి తర్వాత అలమేలు మంగమ్మకు సముచిత స్థానం కల్పించారని తెలిపారు.

సాయంత్రం 6 గంటలకు తిరుప‌తికి చెందిన శ్రీమతి ఆర్.సుశీల బృందం సంగీత సభ, రాత్రి 7 గంటలకు తిరుపతికి చెందిన శ్రీ కె.చంద్రశేఖర్ బృందం హరికథా గానం చేయనున్నారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాలకులు డా. ఆకెళ్ల విభీషణ శర్మ, ఇతర అధికారులు, క‌ళాకారులు, విశేష సంఖ్య‌లో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.