JEO (H&E) INSPECTS CHILDREN’S HOSPITAL WORKS  _ చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను పరిశీలించిన జెఈఓ

చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను పరిశీలించిన జెఈఓ

– మొదటి గుండె మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతం చేసిన వైద్యబృందానికి అభినందన

తిరుపతి, 21 జనవరి 2023: టిటిడి జెఈఓ శ్రీమతి సదా భార్గవి శనివారం అలిపిరి వద్ద చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను ఇంజినీరింగ్ అధికారులతో కలిసి క్షుణ్ణంగా పరిశీలించారు. నిర్మాణ స్థలంలో షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి నెలాఖరులోపు మొదటి దశ పనులు పూర్తి చేయాలని ఆమె ఈఈ శ్రీ కృష్ణారెడ్డిని ఆదేశించారు. అదేవిధంగా రోజువారీ పనుల పురోగతిని సమీక్షించాలని సంబంధిత అధికారులకు సూచించారు.

ఆ తర్వాత జెఈఓ శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్ (SPCHC)ను సందర్శించి, ఆపరేషన్ థియేటర్, మెడికల్ స్టోర్, క్యాథ్ ల్యాబ్ మొదలైనవాటిని పరిశీలించారు. పలువురు రోగులతో మాట్లాడి అక్కడ అందుతున్న వైద్య సేవలు, ఇతర సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.

రోగులకు, వారి సహాయకులకు ఆహ్లాదకరంగా ఉండేలా ఆసుపత్రి వెలుపల, లోపల పచ్చదనాన్ని పెంచాలని ఆమె డిఎఫ్‌ఓ శ్రీ శ్రీనివాస్ ను ఆదేశించారు. తల్లీబిడ్డ, తిరునామం, శంఖుచక్రాల ఆకారంతో మొక్కలు పెంచాలని సూచించారు.

అదేవిధంగా మెరుగైన సమన్వయం కోసం ఇంజనీరింగ్‌ విభాగంలోని సివిల్, ఎలక్ట్రికల్, వాటర్‌వర్క్స్, విజిలెన్స్, హెల్త్ మరియు స్విమ్స్, బర్డ్, చిన్నపిల్లల ఆసుపత్రి రెసిడెంట్ డాక్టర్లతో వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేయాలని జెఈఓ అధికారులను ఆదేశించారు.

ఆసుపత్రిలో ఇప్పటివరకు 1000కు పైగా గుండె శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించి ఎంతో మంది చిన్నారులకు కొత్త జీవితాన్ని అందించిన చిన్నపిల్లల ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి, డాక్టర్ గణపతి నేతృత్వంలోని వైద్యుల బృందాన్ని జెఈవో ప్రశంసించారు. రెండు రోజుల క్రితం ఆసుపత్రిలో తొలిసారిగా గుండె మార్పిడిని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరినీ అభినందించారు. గుండె మార్పిడి చేయించుకున్న బాలుడు తనతో మాట్లాడాడని చెప్పారం. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో ఆసుపత్రి ప్రత్యేక వైద్యుల బృందం బాలుడికి విజయవంతంగా చికిత్స అందించిందని, ఒక వారం పాటు ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉంటాడని తెలిపారు.

జెఈఓ వెంట ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి, ఎస్ఇ ఎలక్ట్రికల్ శ్రీ వెంకటేశ్వర్లు, అదనపు ఆరోగ్యాధికారి డాక్టర్ సునీల్ కుమార్, డిఇ శ్రీమతి సరస్వతి, డిఎఫ్ఓ శ్రీ శ్రీనివాస్, విజిఓ శ్రీ మనోహర్, రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భరత్ తదితరులు ఉన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.

APPRECIATES PAEDIATRIC DOCTORS’ TEAM FOR THE FIRST SUCCESSFUL HEART TRANSPLANTATION

TIRUPATI, 21 JANUARY 2023:  The JEO(H&E) Smt Sada Bhargavi on Saturday thoroughly inspected the ongoing construction works of the upcoming Paediatric Hospital at Alipiri along with the Engineering Officials.

At the construction site, she instructed EE Sri Krishna Reddy to ensure that the first level of works be completed before February end as per schedule. Similarly, she directed the concerned to review the progress of works on a daily basis to avoid any delay in the execution of works.

Later she also visited Sri Padmavathi Children’s Heart Centre (SPCHC) and inspected the OT, Medical Store, cath lab etc. She also interacted with the patients to know about the medical services and other amenities being provided to them, to which they expressed immense pleasure.

She also instructed the DFO Sri Srinivasulu to develop greenery outside as well inside the Hospital premises to provide an aesthetic feel to the patients and their attendants. “Plan some dioramas of Mother and Child, Tirunamam, Shanku and Chakra etc.with the greens itself”, she said.

Similarly, she also instructed the officials to form a WhatsApp group with TTD Engineering including Civil, Electrical, Waterworks, Vigilance, Health and the Resident Doctors of SVIMS, BIRRD and SPCHC to rectify the defects related to any of the above departments without delay.

The JEO appreciated the Doctors team led by the Director of the Paediatric Center Dr Srinath Reddy, Dr Ganapathi and others who have so far successfully carried out over 1000 plus heart surgeries in the hospital and given new lease of life to many children. She also congratulated everyone for the maiden successful Heart Transplantation carried out in the hospital a couple of days ago. 

She said the boy who underwent heart transplantation has spoken with her. “With the benign blessings of Sri Venkateswara Swamy the boy was successfully treated by the team of our dedicated doctors. However he will be under observation in hospital for a week”, she added.

Director Dr Srinath Reddy, SE Electrical Sri Venkateswarulu, Additional Health Officer Dr Sunil Kumar, DE Smt Saraswathi, DFO Sri Srinivas, VGO Sri Manohar, Resident Medical Officer Dr Bharath,  and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI