JEO HEALTH AND EDUCATION INSPECTS _ శ్రీ గోవింద‌రాజ‌స్వామి ఉన్న‌త పాఠ‌శాల‌లో జెఈవో త‌నిఖీలు

TIRUPATI, 05 NOVEMBER 2021: The JEO Health and Education Smt Sada Bhargavi on Friday inspected Sri Govindaraja Swamy High School in Tirupati.

She inspected the sanitation, cleanliness, civil and electrical repairs to be attended etc.

The JEO also interacted with the students and asked them some queries from their academics. She also enquired them about the facilities and their requirements if any.

Devasthanams Education Officer Sri C Govindarajan, Additional EO Dr Sunil Kumar, Head Master Sri Chandraiah were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ గోవింద‌రాజ‌స్వామి ఉన్న‌త పాఠ‌శాల‌లో జెఈవో త‌నిఖీలు

తిరుపతి, 05 నవంబరు 2021: టిటిడి ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న తిరుప‌తిలోని శ్రీ గోవింద‌రాజ‌స్వామి ఉన్న‌త పాఠ‌శాల‌ను శుక్ర‌వారం జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి త‌నిఖీ చేశారు.

పాఠ‌శాల‌లోని త‌ర‌గ‌తి గ‌దులు, బోధ‌నా విధానం, ప‌రిస‌రాల ప‌రిశుభ్ర‌త‌, తాగునీటి వ‌స‌తి, మ‌రుగుదొడ్లను ప‌రిశీలించి అవ‌స‌ర‌మైన సివిల్‌, ఎల‌క్ట్రిక‌ల్ మ‌ర‌మ్మ‌తుల‌ను వెంట‌నే పూర్తి చేయాల‌న్నారు. త‌ర‌గ‌తి గ‌దుల్లోని ఉపాధ్యాయుల‌ను, విద్యార్థుల‌ను పాఠ్యాంశాల‌కు సంబంధించిన ప‌లు ప్ర‌శ్న‌లు అడిగి స‌మాధానాలు రాబ‌ట్టారు. పాఠ‌శాల‌కు అవ‌స‌ర‌మైన మౌలిక వ‌స‌తులు క‌ల్పించాల‌ని ఇంజినీరింగ్ అధికారుల‌ను ఆదేశించారు. పారిశుద్ధ్యం చ‌క్క‌గా ఉండాల‌ని ఆరోగ్య విభాగం అధికారుల‌కు సూచించారు. అనంత‌రం పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌లోని ప‌చ్చ‌ద‌నాన్ని ప‌రిశీలించారు.

జెఈవో వెంట దేవస్థానం విద్యాశాఖాధికారి శ్రీ గోవింద‌రాజ‌న్‌, అద‌న‌పు ఆరోగ్య‌శాఖాధికారి డాక్ట‌ర్ సునీల్‌, పాఠ‌శాల ప్ర‌ధానోపాధ్యాయుడు శ్రీ చంద్ర‌య్య త‌దిత‌రులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.