JEO HOLDS REVIEW MEETING ON VARIOUS DEVELOPMENT ACTIVITIES_ తిరుమలలో అభివృద్ధి పనులపై జెఈవో సమీక్ష
Tirumala, 8 January 2019: Tirumala JEO Sri KS Sreenivasa Raju on Tuesday reviewed on the progress of developmental activities pertaining to various departments at Annamaiah Bhavan in Tirumala.
During the meeting he reviewed on the engineering works including civil, electrical, water etc., development of halls in SV Museum in a phased manner, procurement of various items, parakamani and issues pertaining to other departments.
Later the JEO also reviewed on the arrangements for the ensuing important religious event of Radhasapthami which occurs on February 12 almost one month prior. He instructed all the concerned department HoDs to plan for the arrangements for Radhasapthami keeping in view the past experience.
He directed TTD PRO Dr T Ravi to make gallery wise deployment list of Srivari Sevakulu to extract better services from them to pilgrims who will be sitting in galleries of four mada streets from morning to evening on that auspicious day. Similarly he also instructed the concerned to make a list of employees who will also be deployed for Radhasapthami duty. He directed Annaprasadam and Health wings to make necessary arrangements of food and water distribution for the occasion utilizing the services of Srivari Sevakulu. He also instructed the CMO Dr Nageswara Rao to keep sufficient numbers of medical teams in four mada streets.
SE II Sri Ramachandra Reddy, VSO Sri Manohar, temple DyEO Sri Harindranath, GM Transport Sri Sesha Reddy and other senior officers were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI
తిరుమలలో అభివృద్ధి పనులపై జెఈవో సమీక్ష
తిరుమల, జనవరి 08, 2019: తిరుమలలో భక్తులకు మెరుగైన వసతులు కల్పించేందుకు వివిధ విభాగాల ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు మంగళవారం అన్నమయ్య భవనంలో సమీక్ష నిర్వహించారు. ఇందులో సివిల్, ఎలక్ట్రికల్, వాటర్ వర్క్స్ పనులపై సమీక్ష చేపట్టారు. ఎస్వీ మ్యూజియంలో దశలవారీగా హాళ్ల అభివృద్ధి, కొనుగోళ్లు, పరకామణి తదితర విభాగాలపై చర్చించారు. అదేవిధంగా, ఫిబ్రవరి 12న జరుగనున్న రథసప్తమి పర్వదినం ఏర్పాట్లపై ఒక నెల ముందుగా సమీక్ష నిర్వహించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
రథసప్తమినాడు మాడ వీధుల్లోని గ్యాలరీల్లో వేచి ఉండే భక్తులకు ఉదయం నుండి సాయంత్రం వరకు సేవలు అందించేందుకు గ్యాలరీల వారీగా శ్రీవారి సేవకులకు విధుల కేటాయించాలని టిటిడి పిఆర్వో డా.. టి.రవిని ఆదేశించారు. ఈ పర్వదినానికి విధులు కేటాయించే ఉద్యోగుల జాబితాను రూపొందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. శ్రీవారి సేవకుల సాయంతో భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, తాగునీరు అందించేందుకు తగిన ఏర్పాట్లు చేపట్టాలని అన్నప్రసాదం, ఆరోగ్య విభాగం అధికారులను ఆదేశించారు. మాడ వీధుల్లో భక్తులకు వైద్యసేవలు అందించేందుకు తగినంత మంది వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని సిఎంవో డా.. నాగేశ్వరరావుకు సూచించారు.
ఈ సమావేశంలో టిటిడి ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, విఎస్‌వో శ్రీ మనోహర్, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, ట్రాన్స్‌పోర్టు జిఎం శ్రీ శేషారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.