JEO INSPECTION IN TIRUMALA_ తిరుమలలో జెఈవో తనిఖీలు

Tirumala, 3 December 2017: Tirumala JEO Sri KS Sreenivasa Raju along with CVSO Sri A Ravikrishna inspected VQC and four mada streets on Sunday evening.

As TTD is contemplating for Airport model frisking and scanning mechanism, the officers inspected VQC compartments.

Later they also visited the four mada streets where some improvements are underway.

SE II Sri Ramachandra Reddy, EE Sri Prasad were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI

తిరుమలలో జెఈవో తనిఖీలు

డిసెంబరు 03, తిరుమల, 2017: కలియుగ వైకుంఠమైన తిరుమలలోని పలు ప్రాంతాలలో, శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధులలో తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌. శ్రీనివాసరాజు, సివిఎస్వో శ్రీ ఆకే.రవికృష్ణతో కలిసి ఆదివారం తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ఆలయ నాలుగు మాడ వీధులలోని గ్యాలరీలలో 1.8 లక్షల మంది భక్తులు కూర్చుని వాహనసేవలను వీక్షించవచ్చని తెలిపారు. టిటిడి ఈవో శ్రీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ ఆదేశాల మేరకు మరింత ఎక్కువ మంది భక్తులు కూర్చుని శ్రీవారి వాహనసేవలను తిలకించే అంశాన్ని ఇంజనీరింగ్‌ బృందం పరిశీలిస్తుందన్నారు. తిరుమలలో ఎయిర్‌పోర్టు తరహాలో అధునాతన భద్రతా పరికరాలతో త్వరలో తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో స్కానింగ్‌ యంత్రాలను నూతనంగా ఏర్పాటు చేయనున్న కంపార్టుమెంట్లను ఆయన పరిశీలించారు.

వీరివెంట ఎస్‌ఇ2 శ్రీ రామచంద్రారెడ్డి, విజివో శ్రీ రవీంద్రారెడ్డి, శ్రీవారి ఆలయం డెప్యూటీ ఈవో శ్రీ కోదండరామారావు, ఇతర అధికారులు ఉన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.